Lucky Zodiac Signs: అనుకూల స్థితిలో శుభగ్రహాలు, పాప గ్రహాలు.. ఆ రాశుల వారికి జాక్ పాట్ పక్కా..!

| Edited By: Janardhan Veluru

Dec 13, 2023 | 6:42 PM

శుభ గ్రహాలే కాకుండా ఒకటి రెండు పాప గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ నెలాఖరులోగా ఆరు రాశుల వారు ‘జాక్ పాట్’ కొట్టే అవకాశం ఉంది. గురువు, శుక్రుడు, బుధుడు, శని, రవి, కుజుల అనుకూలతలతో తప్పకుండా ఈ రాశుల వారికి లక్ష్మీయోగం పట్టడం జరుగుతుంది. ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం, లాటరీలు, జూదాలు, అదనపు ఆదాయ ప్రయత్నాలు, జీత భత్యాలు విశేషంగా పెరగడం..

Lucky Zodiac Signs: అనుకూల స్థితిలో శుభగ్రహాలు, పాప గ్రహాలు.. ఆ రాశుల వారికి జాక్ పాట్ పక్కా..!
Lucky Zodiac Signs
Follow us on

శుభ గ్రహాలే కాకుండా ఒకటి రెండు పాప గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ నెలాఖరులోగా ఆరు రాశుల వారు ‘జాక్ పాట్’ కొట్టే అవకాశం ఉంది. గురువు, శుక్రుడు, బుధుడు, శని, రవి, కుజుల అనుకూలతలతో తప్పకుండా ఈ రాశుల వారికి లక్ష్మీయోగం పట్టడం జరుగుతుంది. ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం, లాటరీలు, జూదాలు, అదనపు ఆదాయ ప్రయత్నాలు, జీత భత్యాలు విశేషంగా పెరగడం, ఆస్తుల విలువ పెరగడం, ఆస్తి అమ్మకంలో ఆశించిన దానికంటే ఎక్కువగా లాభం చేకూరడం, ఆస్తి కలిసి రావడం వంటివి ఏవైనా జరగవచ్చు. మొత్తానికి ఆర్థిక పరిస్థితిలో ఖాయంగా గణనీయమైన మార్పు చోటు చేసుకుంటుంది. ఈ రాశులుః మేషం, సింహం, తుల, ధనుస్సు, మకరం, మీనం.

  1. మేషం: ఈ రాశివారికి రాశిలో గురువు, సప్తమంలో శుక్రుడు, భాగ్యంలో బుధుడు, లాభస్థానంలో శనీశ్వరుడు ఉండడం వల్ల ఒక విధమైన లక్ష్మీయోగం ఏర్పడింది. ఈ రాశివారికి అన్ని వైపుల నుంచి ఆర్థిక లాభాలు కలగడంతో పాటు, శత్రు మూలక ధన లాభానికి కూడా అవకాశం ఉండడం విశేషం. ఈ రాశివారంటే ఏమాత్రం ఇష్టం లేనివారి నుంచి కూడా ఆర్థిక ప్రయోజనాలు సమకూరు తాయి. ఆర్థికాభివృద్ధికి సంబంధించి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది.
  2. సింహం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో గురువు, ధన వృద్ధి స్థానమైన తృతీయంలో శుక్రుడు, పంచమ స్థానంలో బుధుడు సంచరించడం ఆర్థిక విషయాల్లో శుభప్రదంగా ఉంది. కొద్ది ప్రయత్నంతో వీరికి ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుంది. ఆదాయం పెంచుకోవడానికి వీరు ఎటువంటి ఆలోచన చేసినా కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త పద్ధతులు, కొత్త వ్యూహాలు ప్రవేశపెట్టి త్వరగా సంపన్ను లయ్యే అవకాశం ఉంది. లాటరీలు, జూదాలు, స్పెక్యులేషన్, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి.
  3. తుల: ఈ రాశిలో రాశ్యధిపతి శుక్రుడు, సప్తమంలో గురువు, ధన స్థానంలో రవి, కుజులు, తృతీయంలో బుధుడు ఉండడం వల్ల అతి తక్కువ కాలంలో అతి తక్కువ ప్రయత్నంతో ఈ రాశివారు సంప న్నులయ్యే అవకాశం ఉంది. ధన స్థానంలో ధనాధిపతి కుజుడు లాభాధిపతి రవితో కలిసి ఉండడం, ఈ రాశిని ధన కారకుడు గురువు వీక్షించడం వంటి కారణాల వల్ల ఈ రాశివారికి లక్ష్మీయోగం పట్టడం జరిగింది. తప్పకుండా అప్రయత్న ధన లాభం కూడా ఉండే అవకాశం ఉంది.
  4. ధనుస్సు: ఈ రాశికి లాభస్థానంలో శుక్రుడు, పంచమ స్థానంలో గురువు, తృతీయ స్థానంలో శనీశ్వరుడు సంచారం చేస్తున్నందువల్ల అపారమైన ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. లాటరీలు, జూదాలు వంటివి బాగా కలిసి వస్తాయి. షేర్లు, ఆర్థిక లావాదేవీలు అంచనాలకు మించి కనక వర్షం కురిపి స్తాయి. పెద్ద ఎత్తున ఆభరణాలు కొనే అవకాశం ఉంది. అక్రమ మార్గాలు కూడా బాగా పెరిగి, ఐశ్వ ర్యాభివృద్ధి జరుగుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలు సానుకూలపడతాయి.
  5. మకరం: ఈ రాశినాథుడైన శనీశ్వరుడు ధన స్థానంలోనే ఉండడం, తృతీయంలో రాహువు, లాభస్థానంలో కుజ, రవులు ఉండడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా ధన వృద్ధి యోగం, ఆకస్మిక ధన లాభం వంటివి కలిగే అవకాశం ఉంది. దాదాపు ప్రతి ఆదాయ ప్రయత్నమూ ఫలిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడి ఆర్థిక లాభాలు సమకూరుతాయి. స్వర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధమైన కోరికలు నెరవేరుతాయి. తప్పకుండా శ్రీమంతులు కావడం జరుగుతుంది.
  6. మీనం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో రాశ్యధిపతి గురువు, భాగ్య స్థానంలో కుజ, రవులు సంచారం చేయడం వల్ల ఆర్థికాభివృద్ధితో పాటు కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడం జరుగుతుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం చేసినా తప్పకుండా లాభం చేకూరుతుంది. ధన స్థానంలో ధన కారకుడైన గురువు సంచారం చేస్తున్నంత కాలం ఆదాయ వృద్ధి ఉంటూనే ఉంటుంది. అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కూడా ఉంది.