జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మనిషి జాతకంపై గ్రహాల ప్రభావం ఉంటుంది. జాతకంలో వివిధ లోహాలు, రత్నాలతో చేసిన ఉంగరాలు మన జీవితాన్ని వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తాయి. జ్యోతిషశాస్త్రం తొమ్మిది గ్రహాలకు ఈ లోహాలు, రత్నాలకు మధ్య సంబంధం ఉందని చెబుతుంది. ఈ ముఖ్యమైన లోహాలలో వెండి ఉంగరాలు కూడా ఒకటి. ఈ రోజు వెండి ఉంగరాలు ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోండి. వెండి ఉంగరం ధరించడం వలన ఆర్ధిక ఇబ్బందులతో పాటు అనేక సమస్యను పరిష్కరించగలదు.
వెండి ఉంగరం శుక్రుడు, చంద్రునితో సంబంధం కలిగి ఉంటుంది. బంగారు, వెండి ఆభరణాలు అందాన్ని మెరుగుపరచడం మాత్రమే కాదు.. జాతక దోషాలను కూడా నివారించడంలో ఉపయోగపడతాయి. బంగారం, వెండితో చేసిన ఆభరణాలు జాతకంలో ఉన్న గ్రహాలు, నక్షత్రాలను కూడా ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. బృహస్పతి గ్రహానికి బంగారానికి సంబంధం కలిగి ఉంది. అయితే వెండికి శుక్రుడు, చంద్రునికి మధ్య సంబంధం కలిగి ఉన్నట్లు భావిస్తారు. పురాణాల నమ్మకం ప్రకారం.. వెండి శివుని కన్ను నుండి ఉద్భవించింది. కాబట్టి వెండి ఎక్కడ ఉంటే అక్కడ సంపద, సుఖ సంతోషాలు ఉంటాయని విశ్వాసం. అంతేకాదు కొన్ని రాశులవారికి వెండి ఉంగరాలు ధరించడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవి ఏమిటో తెలుసుకుందాం..
వెండి ఉంగరాలు ఎవరు ఎలా ధరించాలంటే?
జ్యోతిష్యం ప్రకారం వెండి ఉంగరాన్ని బొటన వేలికి వెండి ఉంగరం ధరించడం శ్రేష్టం.
స్త్రీలు ఎడమ చేతికి, పురుషులకు కుడిచేతికి వెండి ఉంగరం ధరించడం శ్రేయస్కరం. వెండి ఉంగరం చంద్రుని కారకం అని నమ్ముతారు.
వెండి ఉంగరం ధరించడం వలన వ్యక్తుల జాతకంలో సూర్యుడు, శని స్థానం బలపడుతుంది. దీంతో అదృష్టం కూడా బలపడింది.
అంతే కాకుండా వెండి ఉంగరం ధరించడం వల్ల రాహు గ్రహ దోషం తొలగిపోయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వెండి ఉంగరాలు కర్కాటకం, వృశ్చికం, మీనం రాశులకు చాలా పవిత్రమైనవిగా పరిగణించచబడుతుంది.
వృషభం, తుల రాశి వారు కూడా వెండి ఉంగరాలను ధరించవచ్చు.
ఏ రాశివారు వెండి ఉంగరాన్ని ధరించరాదంటే?
అయితే వెండి ఉంగరం మేష, సింహ, ధనుస్సు రాశుల వారు పొరపాటున కూడా ధరించకూడదు. ఈ రాశులవారు వెండి ఉంగరం ధరిస్తే.. శుభానికి బదులు కష్టాలు కలుగుతాయి.
వెండి ఉంగరం ధరిస్తే ఏమి జరుగుతుందంటే?
1. వెండి ఉంగరాన్నీ ధరిస్తే శుక్రుడు, చంద్రుడు మంచి ఫలితాలను ఇస్తారు.
2. మనసు, మెదడు ప్రశాంతంగా ఉంటాయి. కోపం నియంత్రణలోకి వస్తుంది. సంపదతో పాటు ఆనందం పెరుగుతుంది.
3. రుమాటిజం, కఫా , పిత్త వంటి సమస్యలు శరీరంలో సమతుల్యంగా ఉంటాయి.
4. వెండి ఉంగరాలు అందుబాటులో లేకుంటే సిల్వర్ చైన్ కూడా ధరించవచ్చు. దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని విశ్వాసం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).