
వ్యయ స్థానంలో శనీశ్వరుడు సంచారం చేయడం వల్ల ఏలిన్నాటి శని దోషం ఉన్నప్పటికీ, లాభ స్థానంలో రాహువు, మే తర్వాత నుంచి చతుర్థ స్థానంలో ఉచ్ఛ గురువు సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ ఏడాదంతా చాలావరకు సానుకూలంగానే గడిచిపోతుందని చెప్పవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికార యోగానికి బాగా అవకాశం ఉంది. ఉన్నత పదవులు చేపడతారు. ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయగల స్థితికి చేరుకుంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలకు అవకాశం ఉంది. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ధన యోగం పట్టే సూచనలున్నాయి.
లాభ స్థానంలో శని, దన స్థానంలో గురువు సంచారం వల్ల 2025 కంటే 2026 బాగా మెరుగ్గా ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరు తాయి. కుటుంబ జీవితం చాలా వరకు సాఫీగా సాగిపోతుంది. ఆస్తి, ఆర్థిక ముఖ్యమైన వ్యవహా రాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. దశమ స్థానంలో రాహువు సంచారం వల్ల ఉద్యోగంలో మధ్య మధ్య అధికారులతో తలపడే పరిస్థితులు ఎదు రవుతాయి. ఎవరితోనైనా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్న బంధువులతో పెళ్లి సంబంధం ఖాయం అయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో ఈగో సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. తీర్థయాత్రలు, విహార యాత్రలతో పాటు విదేశీ యానానికి కూడా అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ రాశిలో సంచారం చేస్తున్న గురువు ఈ ఏడాది జూన్ మొదటి వారంలో ధన స్థానంలో ఉచ్ఛపడుతున్నందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలన్నీ ఆశించిన ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూలతలు పెరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు అనుకూలగా పరిష్కారమవుతాయి. ఏడాదంతా దశమ స్థానంలో శనీశ్వరుడు అనుకూలంగా ఉన్నందువల్ల కొద్దిగా ఆలస్యంగానైనా పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదల వంటివి జరుగుతుంటాయి. ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభ సమాచారం అందుతుంది. మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు లబ్ధి పొందుతారు. కుటుంబ జీవితం సుఖసంతోషాలతో సాగిపో తుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
ఈ రాశివారికి ఈ ఏడాది జూన్ వరకు ఒక మోస్తరుగానూ, ఆ తర్వాత ఏడాది పొడవునా వైభవంగానూ సాగిపోతుంది. జూన్ మొదటి నుంచి ఈ రాశిలో గురువు ఉచ్ఛపడుతున్నందువల్ల వీరి జీవితమే మారిపోయే అవకాశం ఉంటుంది. శనీశ్వరుడు భాగ్య స్థానంలో సంచారం చేస్తుండడం, జూన్ నుంచి గురువు ఉచ్ఛ సంచారం కారణంగా ఏడాదంతా సంతృప్తికరంగా, బాగా అనుకూలంగా సాగిపోతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభిస్తుంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారాలు లాభాలపరంగా ఊపందుకుంటాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోయే అవకాశం ఉంది. శుభ కార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కొద్దిపాటి శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధి స్తారు. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా, సజావుగా సాగిపోతాయి.
అష్టమ శని, వ్యయ గురువు, సప్తమ రాహువు కారణంగా ఈ రాశివారికి ఈ ఏడాదంతా మిశ్ర మంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. స్వల్ప అనారోగ్యానికి కూడా అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మధ్య మధ్య ఇబ్బంది పెడుతుంది. ఖర్చులు పెరిగి రుణాలు చేయాల్సి వస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. వ్యయ స్థానంలో ఉన్న గురువు కారణంగా ఆదాయ వృద్ధి ఉంటుంది కానీ, అందుకు తగ్గట్టుగా వృథా ఖర్చులు కూడా ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఏడాది ప్రథమార్థం బాగానే ఉంటుంది కానీ, ద్వితీయార్థంలో మాత్రం ఇబ్బందులు కలుగుతాయి. ప్రథమార్థంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మధ్య మధ్య ధన యోగం పట్టి, ముఖ్యమైన అవసరాలు తీరడం, ఆర్థిక సమస్యలు తగ్గడం వంటివి కూడా జరుగుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగుతాయి.
ప్రధాన గ్రహాల అనుకూలత వల్ల ఏడాదంతా జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. ప్రస్తుతం దశమ స్థానంలో ఉన్న గురువు జూన్ నెలలో లాభ స్థానంలోకి మారడం, సప్తమంలో శనీశ్వరుడు, షష్ట స్థానంలో రాహువు సంచారం చేస్తుండడం వగైరా కారణాల వల్ల ఈ రాశివారికి కొత్త సంవత్సరం గత సంవత్సరం కంటే వైభవంగా కొనసాగుతుంది. వ్యక్తిగతంగా, కుటుంబపరంగానే కాక, వృత్తి, ఉద్యోగాల పరంగా కూడా ప్రధానమైన సమస్యలు తగ్గుముఖం పడ తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవు తాయి కానీ అందుకు తగ్గుట్టుగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. జూన్ వరకు ఆర్థికపరంగా, కుటుంబపరంగా పురోగతి ఉంటుంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యానికి లోటుండదు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి.
షష్ట స్థానంలో శని, జూన్ వరకు భాగ్యస్థానంలో గురు సంచారం వల్ల ఈ రాశివారి జీవితం అన్ని రకాలుగానూ సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆదాయం పెరిగి, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. ఈ రాశివారికి ఏడాదంతా శుభ పరిణామాలతో, శుభ వార్తలతో, శుభ కార్యాలతో సాగిపోతుంది. ఈ రాశివారికి గత ఏడాది కంటే ఈ ఏడాది తప్పకుండా మెరుగ్గా, శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. ఆరవ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల ఆదాయం పెరగడమే కాక, ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక అనారో గ్యాల నుంచి ఉపశమనం కలుగుతుంది. పంచమ స్థానంలో ఉన్న రాహువు కారణంగా స్నేహితులు లేదా నమ్మినవారు ఆర్థికంగా మోసం చేయడం వంటివి జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు మంచి విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి.
ఈ రాశివారికి కొత్త సంవత్సరం ప్రథమార్థం ఎక్కువగా అనుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం లేదు. రాశ్యధిపతి కుజుడు తప్ప మరే గ్రహమూ అనుకూలంగా లేనందువల్ల శ్రమాధిక్యత, వ్యయ ప్రయాసలు, ఆశాభంగాలు ఎక్కువగా ఉంటాయి. అయితే, జూన్ నుంచి మాత్రం ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో, కొద్ది శ్రమతో సంవత్సరమంతా ఆర్థికంగా, ఉద్యోగపరంగా శుభప్రదంగా సాగిపోతుంది. అన్ని రంగాల్లోనూ సత్ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం మీద కొద్దిగా శ్రద్ధ పెట్టే పక్షంలో ఈ రాశివారికి ఏ విషయంలోనూ లోటు ఉండదు. జూన్ నుంచి వృత్తి, ఉద్యోగాల పరంగా హోదా పెరుగుతుంది. కుటుంబ జీవితం సుఖమయంగా సాగిపోతుంది. లాభాలపరంగా వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. అనేక విధాలుగా సంపాదన పెరుగుతుంది. విద్యార్థులు స్వల్ప ప్రయత్నంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
కొత్త సంవత్సరం ప్రథమార్థం ఈ రాశివారికి వైభవంగా సాగిపోతుంది. రాశ్యధిపతి గురువు సప్తమ స్థాన సంచారం, రాహువు తృతీయ స్థాన సంచారం వల్ల ప్రథమార్థమంతా ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది. ద్వితీయార్థంలో గురువు అష్టమ స్థానంలోకి మారడం వల్ల ఇబ్బందులు, సమస్యలు తప్పకపోవచ్చు. ప్రస్తుతం గురు, రాహువుల అనుకూల సంచారం వల్ల ఏ ప్రయత్నం చేసినా సఫలం అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆదాయంతో పాటు అనవసర ఖర్చులు, శుభకార్యాల మీద ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విదేశాలకు సంబంధిం చిన సంస్థల్లోకి ఉద్యోగం మారడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. అనారోగ్యం నుంచి కోలుకోవడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక ప్రయత్నాలు, ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు పెళ్లిళ్లకు దారితీస్తాయి.
తృతీయ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల ఏడాదంతా అనుకూలతలు పెరుగుతాయి. అనేక విధాలుగా పురోగతి సాధిస్తారు. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం శ్రేష్ఠంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆరవ స్థానంలో సంచారం చేస్తున్న గురువు జూన్ నుంచి ఏడవ స్థానంలో ఉచ్ఛపడు తున్నందువల్ల జీవితం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆశించిన విధంగా ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది.వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు పెరగడం, స్థిరత్వం ఏర్పడడం, తగిన గుర్తింపు లభించడం వంటివి జరుగుతాయి. విదేశీ ఉద్యోగాలకు అవకాశం ఉంది. విదేశాల్లో స్థిరపడడం కూడా జరుగుతుంది. మాట చెల్లుబాటు అవుతుంది. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
ఏలిన్నాటి శని కారణంగా ఈ రాశివారికి ఈ ఏడాదంతా మిశ్రమ ఫలితాలు అనుభవానిఝకి వస్తాయి. ప్రస్తుతం పంచమ స్థానంలో గురువు సంచారం వల్ల ప్రథమార్థం కొద్దిగా యోగదాయ కంగా ఉండే అవకాశం ఉంది. జూన్ లో గురువు షష్ట స్థానంలోకి మారిన తర్వాత నుంచి జీవి తంలో కొద్దిగా స్తబ్ధత ఏర్పడుతుంది. జూన్ తర్వాత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం కొద్దిగా మందగిస్తుంది. ఆశించిన స్థాయిలో ఆర్థికాభివృద్ధి ఉండకపోవచ్చు. మొదటి ఆరు నెలలు ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యానికి లోటుండదు. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. విదేశీ ఉద్యోగాలకు లేదా చదువులకు అవకాశం ఉంటుంది. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆహార, విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. విద్యార్థులు జూన్ నుంచి తమ చదువులపై శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. పెళ్లి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు బాగా నిరుత్సాహం కలిగిస్తాయి.
ప్రధాన గ్రహాలైన గురు, శనులు అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. జూన్ నెలలో రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్ఛపట్టిన తర్వాత జీవితం కొద్దిగా మెరుగుపడుతుంది. అంత వరకూ ప్రతికూలతలు తప్పకపోవచ్చు. జూన్ నెల వరకు ఈ రాశివారు వృత్తి, ఉద్యోగాల పరంగానే కాకుండా ఆర్థికంగా కూడా కొద్దిగా కష్టనష్టాలను అనుభవించక తప్పదు. జూన్ తర్వాత మాత్రం జీవితం చాలావరకు సానుకూలంగా మారిపో తుంది. ముఖ్యంగా ఎటువంటి ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరు గుపడుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.