Zodiac Signs
ఈ నెల 9న మకర రాశిలో ఏర్పడుతున్న అమావాస్య నుంచి ఆరు రాశుల వారి జీవితాల్లో అనేక సానుకూల మార్పుల చోటు చేసుకోబోతున్నాయి. ఆ తర్వాత శుక్రుడు కూడా మకర రాశిలోకి ప్రవేశిస్తున్నందు వల్ల అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇది ఏప్రిల్ 17 వరకు కొనసాగుతుంది. ఈ ఆరు రాశులు మేషం, వృషభం. కర్కాటకం, వృశ్చికం, మకరం, మీనం. ఈ రాశుల వారు జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు. వివిధ రంగాలలో విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా ప్రేమ, డబ్బు విషయాల్లో వీరిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. కొత్తగా గృహ, వాహన సౌకర్యాలకు అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని ప్రమోషన్లు అందవచ్చు.
- మేషం: ఈ రాశివారికి దశమ స్థానంలో నాలుగు గ్రహాలు కలుస్తున్నందువల్ల ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. తల్లితండ్రుల నుంచి ఆదరణ పెరుగుతుంది. వారి నుంచి సంపద లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో పెద్ద ప్రణాళికలు, ప్రాజెక్టులు చేపట్టి తమ ప్రతిభా పాటవాలను నిరూపించుకుంటారు. అనేక విధాలుగా ఆర్థిక పరిస్థితి మెరుగు పడు తుంది. ఏ రంగంలో ఉన్నా వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగా మెరుగు పడుతుంది.
- వృషభం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో గ్రహాలు ఎక్కువ సంఖ్యలో కలుస్తున్నందువల్ల అనేక విధాలుగా సంపద పెరిగే అవకాశం ఉంది. శుభవార్తలు, శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈ నెల 9 తర్వాత తప్పకుండా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా అవకాశం ఉంది. వృత్తి జీవితం తిరుగులేని విధంగా సాగిపోతుంది. పుణ్య క్షేత్రాలు, ఇతర పవిత్ర స్థలాలను సందర్శించడం జరుగుతుంది.
- కర్కాటకం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో శుభ గ్రహాలు యుతి ఏర్పడుతున్నందువల్ల ఏ ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. ప్రేమ వ్యవహారాల్లోనే కాకుండా ఆర్థిక వ్యవహారాల్లో కూడా విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో సామరస్యం, అన్యోన్యత బాగా పెరుగుతాయి. సంతోషకరమైన దాంపత్య జీవితం గడుపుతారు. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సొంత వ్యాపారం కోసం పెట్టుబడులకు సంబంధించిన ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి.
- వృశ్చికం: ఈ రాశివారికి మూడవ స్థానంలో నాలుగు గ్రహాల సంయోగం జరుగుతున్నందువల్ల ఏ ప్రయత్న మైనా సఫలం అవుతుంది. ముఖ్యంగా వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని మరింతగా మెరుగుపరచుకోవ డానికి అవకాశాలు అందుతాయి. శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. అవసరానికి మించిన డబ్బు అందుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఇష్ట మైన ఆలయాలు సందర్శించడం జరుగుతుంది. ఎంతో ఆహ్లాదకరమైన జీవితం గడపడం జరుగుతుంది.
- మకరం: ఈ రాశిలో నాలుగు గ్రహాల సంయోగంతో పాటు అమావాస్య కూడా ఏర్పడుతున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవితం సానుకూల మలుపులు తిరుగు తుంది. సామాజికంగా గుర్తింపు పొందుతారు. ప్రతిభా పాటవాలు మరింతగా వెలుగు చూస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి దోహదం చేసే అవకాశాలు అందివస్తాయి. జీవితం సాఫీగా సాగి పోతుంది. ప్రతి రంగంలోనూ విజయాలు సాధిస్తారు. వ్యాపారాల్లో సమస్యల పరిష్కారం అవుతాయి.
- మీనం: ఈ రాశివారికి లాభ స్థానంలో నాలుగు గ్రహాలు కలవడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయ వంతం అవుతుంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబడి సంపద పెరుగుతుంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఎటువంటి సమస్యలనైనా అధిగమిస్తారు. ఆర్థిక సమస్యలన్నీ చాలావరకు పరిష్కారం అవుతాయి. సామాజికంగా కూడా ఉన్నత హోదా, ఆదరణ లభిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.