Amavasya July 2024
ఈ నెల 5,6,7 తేదీల్లో మిథున రాశిలో రవి, చంద్రులు కలవడం వల్ల అమావాస్య ఏర్పడుతోంది. అమావాస్య వల్ల కేవలం అవయోగాలు మాత్రమే ఏర్పడతాయని, అన్నీ నష్టాలే జరుగుతాయని భావించడంలో అర్థం లేదు. అమావాస్య రోజుల్లో శుభ కార్యాలు చేపట్టకపోవడం, ప్రయాణాలు చేయకపోవడం మంచిదని మాత్రమే జ్యోతిషశాస్త్రం చెబుతోంది. రవి, చంద్రులు రెండూ రాజ గ్రహాలే అయినందువల్ల ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశులకు ఎక్కువగా శుభ ఫలితాలు, శుభ యోగాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. మేషం, వృషభం, సింహం, కన్య, మకరం, కుంభ రాశులకు జీవితంలో కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశికి తృతీయ స్థానంలో రవి, చంద్రులు కలవడం వల్ల ఏ ప్రయత్నమైనా సఫలం అయ్యే అవ కాశం ఉంటుంది. ఈ రాశికి ఇది వృద్ధి స్థానం అయినందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహిం చని పురోగతి ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. విదేశీయానానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందు తాయి. తోబుట్టువులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
- వృషభం: ఈ రాశికి ధన స్థానంలో అమావాస్య ఏర్పడడం వల్ల అంచనాలకు మించిన ధన వృద్ధి ఉంటుంది. కుటుంబ సమస్యలు సమసిపోతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. అప్రయత్న ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలో జీత భత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహాలు, సూచనలను అనుసరించి అధికారులు ప్రయోజనం పొందుతారు.
- సింహం: ఈ రాశికి లాభ స్థానంలో రవి, చంద్రుల కలయిక ఏర్పడడం విపరీత రాజయోగాన్ని కలిగిస్తుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. హోదా పెరగడానికి అవకాశం ఉంది. జీతభత్యాలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో బాగా డిమాండ్ పెరుగుతుంది. ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఉన్నత స్థాయి వారితో పరిచయాలు ఏర్పడతాయి. అనారోగ్యాల నుంచి ఆశించిన ఉపశమనం లభిస్తుంది.
- కన్య: ఈ రాశివారికి దశమ స్థానంలో అమావాస్య ఏర్పడడం వల్ల ఉద్యోగంలో సానుకూల మార్పులు, శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడడంతో పాటు ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ ఉద్యోగావకాశాలు కూడా అంది వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. పోటీదార్లు, ప్రత్యర్థుల మీద విజయాలు సాధి స్తారు. గౌరవమర్యాదలు వృద్ధి చెందుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
- మకరం: ఈ రాశికి ఆరవ స్థానంలో ఈ రెండు రాజగ్రహాల కలయిక జరిగినందువల్ల శత్రు, రోగ, రుణ సమ స్యల నుంచి చాలావరకు ఊరట లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. బంధువుల వల్ల అనేక లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఇష్టమైన సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారాలు నష్టాల నుంచి క్రమంగా బయటపడతాయి. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగు తుంది. ఉద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశముంది.
- కుంభం: ఈ రాశివారికి పంచమ స్థానంలో ఈ రవి చంద్రులు కలవడం వల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. కొత్త నైపుణ్యాలను అలవరచుకుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. విదేశాల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. కుటుంబంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా పిల్లలు బాగా వృద్ధిలోకి రావడం జరుగుతుంది.