Planet Transit-July 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల స్థితిగతుల్లో వచ్చే ఏ చిన్న మార్పు అయినా మానవ జీవితంపై పెను ప్రభావం చూపగలదు. అలాంటిది 8 రోజుల వ్యవధిలోనే 3 గ్రహాలు తమ రాశిని మార్చుకుంటే..? ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి..? గ్రహాలు తమ రాశిని మార్చుకుంటే రాశి చక్రమంలోని కొన్ని రాశులవారికి శుభఫలితాలు, మరికొందరికి అశుభఫలితాలు కలుగుతాయి. అయితే జూలై మొదటి 8 రోజుల్లో సంభవించే గ్రహాల రాశి మార్పు మాత్రం రాశిచక్రంలోని కొన్ని రాశులవారికి లాభదాయకంగా ఉండనున్నాయి. అవును, జూలై 1న కుజగ్రహం 1న సింహరాశిలోకి.. జూలై 7న అదేరా రాశిలోకి శుక్రుడు, అలాగే జూలై 8న కర్కాటక రాశిలోకి బుధుడు ప్రవేశించనున్నాడు. ఇలా 3 గ్రహాలు స్వల్ప వ్యవధిలో రాశిని మార్చుకోవడం వల్ల కొన్ని రాశులకు శుభసమయాన్ని, అదృష్టాన్ని ఇచ్చేదిగా ఉండబోతుంది. ఇంతకీ ఆ లక్కీ రాశులేమిటంటే..
తులారాశి: జూలై నెల మొదటి 8 రోజుల్లోనే శుక్ర, కుజ, బుధ గ్రహాలు తమ రాశిని మార్చుకోవడం వల్ల తులారాశికి మంచి సమయంగా పరిణమించబోతుంది. ఈ సమయంలో తులారాశివారు చేపట్టిన ప్రతి పని సఫలమవుతుంది. ఆగిపోయిన పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. వివాదాలు తొలగిపోతాయి. ఇంకా చేపట్టిన ప్రతి పనిలో విజయం, సమాజంలో కీర్తిప్రతిష్టలను పొందుతారు.
సింహ రాశి: సింహరాశిలోకి కుజశుక్ర గ్రహాల ఆగమనం, కర్కాటకంలోకి బుధ గ్రహ ప్రవేశం సింహరాశివారికి శుభ ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. ఫలితంగా మీరు ఎంతగానో లాభపడతారు. వైవాహిక జీవితంలో వివాదాలు తొలగిపోయి.. జీవిత భాగస్వామితో సాన్నిహిత్యంగా ఉంటారు. ఆస్తి వివాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. స్థిరాస్తులను కొనుగోలు చేసేందుకు కూడా ఇది చాలా మంచి సమయం.
మేష రాశి: మేషరాశివారికి కూడా జూలైలో 3 గ్రహాలు తమ రాశిలో మార్పు శుభప్రదంగా ఉంటుంది. కెరీర్‌లో పురోగతి, అర్థిక స్థిరత్వం, ప్రతిపనిలో విజయం, సమాజంలో మంచిపేరును పొందగలుగుతారు. ముఖ్యంగా ఇది వ్యాపారులకు చాలా మంచి కాలం అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో ఎంతటి దుర్భర పరిస్థితి అయినా సరే అప్పు ఇవ్వవద్దని వారు సూచిస్తున్నారు.
మిథున రాశి: జూలై నెల తొలి పది రోజుల్లో చోటు చేసుకోబోయే 3 గ్రహాల రాశిమార్పు మిథునరాశివారికి ఎంతో సానుకూలంగా ఉండనుంది. ఈ సమయంలో మీకు మంచి లాభాలతో పాటు కొత్త కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. అలాగే కొత్త మిత్రులను పొందగలుగుతారు. పెట్టుబడి పెట్టేందుకు కూడా ఇది శుభ సమయం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..
నోట్: ఈ కథనంలో తెలిపిన సమాచారం నమ్మకాల మీద ఆధారితం. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇంకా టీవీ9 తెలుగు ఈ సమాచారాన్ని దృవీకరించడం లేదు.