YSRCP: ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై కొనసాగుతోన్న కసరత్తు.. ఆరో జాబితాలోనూ భారీగా మార్పులు!
ఇప్పటివరకు 74మందిని ప్రకటించింది వైసీపీ. తొలి జాబితాలో 11మందిని, రెండో జాబితాలో 27మందిని, మూడో జాబితాలో 21మందిని, నాలుగో జాబితాలో 8మందిని, ఐదో జాబితాలో ఏడుగురు ఇన్‌ఛార్జ్‌లను మార్చింది. ఆరో జాబితాలోనూ భారీగా మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్, ఫిబ్రవరి 1:– లేటెస్ట్‌గా వైసీపీ ఐదో లిస్ట్ కూడా వచ్చేసింది. ఈసారి ఏడుగురి పేర్లతో జాబితా ప్రకటించింది వైసీపీ. ఇందులో మూడు అసెంబ్లీ, నాలుగు లోక్‌సభ సెగ్మెంట్లు ఉన్నాయ్. అయితే, ఆల్రెడీ అనౌన్స్ చేసిన రెండు స్థానాల్లో మరోసారి మార్పులు జరిగాయ్. ఇప్పటికే ప్రకటించిన అరకు ఇన్‌ఛార్జ్ గొట్టేటి మాధవిని తొలగించి… ఆమె స్థానంలో రేగం మత్స్యలింగానికి బాధ్యతలు అప్పగించింది వైసీపీ. అలాగే, సత్యవేడులోనూ మరోసారి మార్పు జరిగింది. మూడో జాబితాలో సత్యవేడు ఇన్‌ఛార్జ్‌గా అపాయింటైన ఎంపీ గురుమూర్తిని… తిరిగి తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్‌కే పంపారు. దాంతో, సత్యవేడు కొత్త ఇన్‌ఛార్జ్‌గా నూకతోటి రాజేష్‌ను ప్రకటించారు. అవనిగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబుకు మచిలీపట్నం పార్లమెంట్ బాధ్యతలు అప్పగించడంతో… అక్కడ కొత్త ఇన్‌ఛార్జ్‌గా సింహాద్రి చంద్రశేఖర్‌రావును నియమించారు. ఇక, నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌ను, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్‌ను ప్రకటించింది వైసీపీ.
ఇప్పటివరకు 74మందిని ప్రకటించింది వైసీపీ. తొలి జాబితాలో 11మందిని, రెండో జాబితాలో 27మందిని, మూడో జాబితాలో 21మందిని, నాలుగో జాబితాలో 8మందిని, ఐదో జాబితాలో ఏడుగురు ఇన్‌ఛార్జ్‌లను మార్చింది. ఆరో జాబితాలోనూ భారీగా మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రకటించిన ఇన్‌ఛార్జ్‌ల్లో కొందరిని మార్చుతారని ప్రచారం జరుగుతోంది. కాకినాడ, అమలాపురం ఎంపీ అభ్యర్థులపై సస్పెన్స్ వీడటం లేదు. గుంటూరు, బాపట్ల ఎంపీ అభ్యర్థులపైనా ఉత్కంఠ కొనసాగుతోంది. బాపట్లకు రావెల కిశోర్‌బాబును ప్రకటిస్తారని టాక్ నడుస్తోంది. గుంటూరు అభ్యర్థిగా పరిశీలనలో ఉమ్మారెడ్డి వెంకటరమణ పేరు పరిశీలనలో ఉంది అంటున్నారు. ఆరో జాబితాలో ఎలాంటి సంచలనాలు ఉండబోతున్నాయ్? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఐదో జాబితాలో ప్రకటించిన ఏడుగురు ఇన్‌ఛార్జ్‌లు వీరే…
- =కాకినాడ(ఎంపీ)-చలమలశెట్టి సునీల్
- =మచిలీపట్నం(ఎంపీ)-సింహాద్రి రమేష్‌బాబు
- =తిరుపతి(ఎంపీ)-మద్దెల గురుమూర్తి
- =అవనిగడ్డ-సింహాద్రి చంద్రశేఖర్‌రావు
- =సత్యవేడు(ఎస్సీ)-నూకతోటి రాజేష్
- =అరుకు వేలీ (ఎస్టీ): రేగం మత్స్య లింగం
- =నర్సారావుపేట (ఎంపీ): పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్
మరిన్ని తాజా వార్తలు ఇక్కడ చదవండి
