YSRCP Plenary 2022 Highlights: దివంగత సీఎం వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని.. వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీ (YSRCP Plenary 2022) సమావేశాలు నేటినుంచి రెండు రోజులపాటు జరగనున్నాయి. మొదటి రోజు సమావేశాలు ముగిశాయి. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ఎదుట శుక్రవారం, శనివారం జరిగే వైసీపీ ప్లీనరీ సమావేశాలకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశాల్లో భాగంగా YSRCP అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. దీంతోపాటు ప్లీనరీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దాదాపు రెండు లక్షలమందికి పైగా హాజరయ్యే ఈ సమావేశాల్లో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ కూడా పాల్గొన్నారు. తొలిరోజు ఐదు అంశాలపై చర్చ జరగనుంది.
సమావేశాల్లో భాగంగా ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు వైసీపీ పార్టీ సభ్యుల రిజిస్ట్రేషన్ జరిగింది. పార్టీ అధ్యక్ష ఎన్నిక అనంతరం వైసీపీ చీఫ్, సీఎం జగన్ ప్రసంగించనున్నారు. అనంతరం పార్టీ నివేదిక, పార్టీ నియమావళి సవరణల ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్నారు.
ప్లీనరీలో జగన్ ఏం చెప్పబోతున్నారు.. పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా తనకు తాను ఎన్ని మార్కులేసుకుంటారు. ముందస్తు ఎన్నికలపై ఏదైనా హింట్ ఇస్తారా.. ప్రతిపక్షాలపై కొత్తగా ఏవైనా బాణాలు సంధిస్తారా. నవరత్నాల్లాంటి జనరంజక పథకాల్ని ఇంట్రడ్యూస్ చేస్తారా.? ఇలా ప్లీనరీలో సమాధానం కోసం ఎదురుచూసే బరువైన ప్రశ్నలు బోలెడన్ని. వీటన్నిటికీ జగన్ స్పీచ్ కాపీయే సమాధానం కాబోతోంది.
చంద్రబాబును తిట్టడానికి మాత్రమే ఈ ప్లీనరీలు జరుగుతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. అభివృద్ధిని మరిచి తెలుగుదేశం పార్టీని తిట్టడానికి ప్లీనరీలను నిర్వహించారని ఆరోపించారు. అభివృద్ధిని మాని సజ్జల, జగన్మోహన్ రెడ్డిల దుష్ట చతుష్టయం రాష్ట్రాన్ని పంచుకుని దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు.
ప్రతి రోజూ పేదల సంక్షేమం కోసం పని చేసే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని మంత్రి విడుదల రజిని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన సంక్షేమం, ప్రజాహితం కోసమేనని అన్నారు. కోట్లాది మందికి ఉచితంగా, మెరుగైన వైద్యం అందించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని అన్నారు.
వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశంలో మాజీ మంత్రి అనిల్ యాదవ్ టీడీపీ నేతలపై మండిపడ్డారు. తాము సంస్కారంతో మెలుగుతూ శాంతియుతంగా ఉన్నామని, నారా లోకేష్ కమెడియన్‌లా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
వైఎస్సార్‌సీపీ ప్లీనరీ మొదటి రోజు సమావేశాలలో పలు తీర్మానాలు చేశారు. మహిళా సాధికారత-దిశ చట్టంపై, విద్యారంగంలో సంస్కరణలపై, నవరత్నాలు, వైద్య ఆరోగ్య రంగంపై తీర్మానాలు చేశారు.
మహిళలను మహరాణులుగా చేసేందుకు సీఎం జగన్ పని చేస్తున్నారని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకురాలు లక్ష్మీపార్వతి అన్నారు. మహిళా సాధికారత కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని అన్నారు. విపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా జగన్ వెనక్కి తగ్గడం లేదన్నారు.
ప్లీనరీలో మహిళా సాధికారత-దిశా చట్టంపై తీర్మానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ.. సామాజిక న్యాయం ఏపీలో సంపూర్ణంగా జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో రాష్ట్రంలోని మహిళలం తా సంతోషంగా ఉన్నారన్నారు.
నవరత్నాలు అంశంపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీర్మానం చేశారు. ఒకేసారి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ది అని అన్నారు. నవరత్నాలు, గ్రామ సచివాలయాలను, స్టడీ చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి వస్తు్న్నారని పేర్కొన్నారు.
విద్యారంగం అభివృద్ధికి సీఎం ఒక యజ్ఞంలా పని చేస్తున్నారని బోత్స సత్యనారాయణ అన్నారు. కార్పొరేట్‌కు ధీటుగా విద్యారంగంలో మార్పులు తీసుకువచ్చినట్లు చెప్పారు.
వైఎస్సార్ ప్లీనరీ సమావేశాలు కొనసాగుతున్నాయి. విద్యారంగంలో సంస్కరణలపై రెండో తీర్మానం చేశారు. విద్యారంగం అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు తీర్మానం చేశారు.
వైసీపీ జెండా ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది. ఆశయం కోసం పోరాడే పులి వైఎస్ జగన్ అని మంత్రి రోజా అన్నారు. ప్రజల గుండెల్లో గుడికట్టుకున్న నాయకుడు వైఎస్సార్ అని అన్నారు. వైసీపీ జెండాలో పోరాటం ఉందన్నారు.
ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. విద్య ద్వారానే సమాజ అభివృద్ధి జరుగుతుందన్నారు.
వక్రీకరణకు, విమర్శలకు తావులేకుండా వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు విజయమ్మ ప్రకటించారు.
వైఎస్ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొనసాగడం సమంజసంగా కాదంటూ తెలిపారు.
షర్మిలకు అండగా ఉండాల్సిన బాధ్యత తనకుందంటూ విజయమ్మ పేర్కొన్నారు. తెలంగాణ కోడలిగా షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకుందని తెలిపారు. దీనిపై ఎల్లో మీడియాలో రకరకాల ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
జగన్ జైల్లో ఉన్నపుడు ప్రజలు ఆందోళనకు గురి కాకూడదనే తన కూతురు షర్మిల పాదయాత్ర చేశారని వైఎస్ విజయమ్మ తెలిపారు. జగనన్న వదిలిన బాణంగా షర్మిల జనాల్లోకి వెళ్లారన్నారు. వేల కిలోమీటర్లు షర్మిల పాదయాత్ర చేసినట్లు తెలిపారు.
జగన్‌పై అభిమానాన్ని చూసి గర్విస్తున్నానని వైఎస్ విజయమ్మ తెలిపారు. ఎన్ని కుట్రలు చేసినా జగన్.. ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకోచ్చారని తెలిపారు. జగన్ తండ్రి వైఎస్ఆర్ బాటలో నడుస్తున్నారని తెలిపారు.
ఎంతో ఓర్పుతో జగన్ అంచెలంచెలుగా ఎదిగారని.. కాంగ్రెస్ పొమ్మనలేక పొగబెట్టిందని వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటతో జగన్ నిలబడ్డారని తెలిపారు.
ఇప్పటికీ కోట్లాది మంది ప్రజల హృదయాల్లో వైఎస్ఆర్ ఉన్నారని విజయమ్మ పేర్కొన్నారు. జగన్ ఎంతో కష్టపడితే తప్ప ఈ స్థానానికి రాలేదని తెలిపారు. వైఎస్ జగన్ ప్రజలందరి పక్షాన నిలుస్తూ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారన్నారు.
జనం మధ్య నుంచే వైసీపీ పుట్టిందని వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం.. పేదల కోసం వైఎస్ఆర్‌సీపీ పురుడుపోసుకుందని పేర్కొన్నారు.
అధికారం అంటే అహంకారం కాదు.. ప్రజలందరి మమకారమని సీఎం జగన్ పేర్కొన్నారు. కష్టసుఖాల్లో ఈ జగమంత కుంటుంబం తన చేయి వీడలేదంటూ సీఎం పేర్కొన్నారు.
175 స్థానాల్లో 151 మందితో అధికారం చేపట్టినట్లు తెలిపారు. చరిత్రలో కనీవినీఎరుగని రీతిలో ఆశీర్వదించారిని పేర్కొన్నారు. తమను ఇబ్బందులకు గురిచేసిన వారిని 3 ఎంపీ సీట్లు 23 అసెంబ్లీ సీట్లకు పరిమితం చేశారని పేర్కొన్నారు.
ప్లీనరీ సమావేశాల్లో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఓదార్పు యాత్రతో ప్రారంభమైన ఈ సంఘర్షణ వైఎస్ఆర్‌సీపీ పార్టీగా అవతరించిందని పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఆశయ సాధనలో తనతో అండగా ఉన్న అందరికీ సీఎం కృతజ్నతలు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోధులందరికీ.. ఆప్తుడిగా, కుటుంబ సభ్యులందరికీ సెల్యూట్ చేస్తున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు. పార్టీ ప్రారంభం అయిన తర్వాత 13 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదంతో 2019లో అధికారం చేపట్టినట్లు తెలిపారు. 175 స్థానాల్లో 151 మందితో అధికారం చేపట్టినట్లు తెలిపారు.
ప్లీనరీ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి స్వర్గియ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సీఎం జగన్ నివాళులర్పించారు.
ప్లీనరీ వేదికకు చేరుకున్న సీఎం జగన్‌కు వైసపీ నేతలు సన్మానం చేశారు.
వైసీపీ ప్లీనరీ సభా ప్రాంగణంలో సీఎం జగన్ YSRCP జెండాను ఆవిష్కరించారు. ఆయన వెంట వైఎస్ విజయమ్మ, మంత్రులు, ఎంపీలు, వైసీపీ నాయకులు ఉన్నారు.
వైసీపీ ప్లీనరీ సమావేశాలకు సీఎం జగన్, తల్లి విజయమ్మతో కలిసి చేరుకున్నారు. సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్‌కు మంత్రులు, ఎంపీలు, వైసీపీ నాయకులు స్వాగతం పలికారు.
వైసీపీ ప్లీనరీలో ఎన్నికలపై సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ముచ్చట లేదని తేల్చి చెప్పారు. రాబోయే కాలంలో అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలపై రూపకల్పన చేయనున్నట్లు రాంబాబు వెల్లడించారు.
కాసేపట్లో వైసీపీ ప్లీనరీ ప్రారంభంకాబోతోంది. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ఎదుట రెండ్రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ముందుగా పార్టీ జెండా, ఆ తర్వాత వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం జగన్. ఇక కాసేపట్లో ప్రసంగించనున్న సీఎం జగన్ స్పీచ్‌పై ఉత్కంఠ నెలకొంది.
జగన్ సీఎం అయిన తర్వాత జరుగుతున్న మొదటి ప్లీనరీ కావడంతో ఎక్కడా తగ్గకుండా పార్టీ పండుగ కోసం గ్రాండ్ అరేంజ్‌మెంట్స్ చేశారు. 40ఎకరాల ప్రాంగణంలో ఏర్పాట్లుచేశారు. మొదటిరోజైన ఇవాళ లక్షమంది వస్తారని అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. ఇవాళ 5 తీర్మానాలను ఆమోదించనుంది ప్లీనరీ.
వైసీపీ ప్లీనరీ పండుగ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచీ పార్టీ శ్రేణులు తరలి వచ్చాయి.. లీడర్‌తో పాటు కేడర్ ఉల్లాసంగా, ఉత్సాహంగా వేదిక దగ్గరకు చేరుకుంటున్నారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది. వైఎస్ఆర్ కుటుంబం ఫోటోలు, సీఎం జగన్ చేసిన సంక్షేమ పధకాలు, నెరవేర్చిన హామీలు చిత్ర రూపంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసారు..
ప్లీనరీకి వచ్చిన అతిథులకు వంటకాలు సిద్ధమవుతున్నాయి. ఈసారి ప్లీనరీలో వంటా వార్పు ఘనంగా ఉండబోతోంది. వైసీపీ వారి విందు… అహహ్హ నాకే ముందు అనే రేంజ్‌లో రెడీ అవుతున్నాయి. రెండు లక్షల మంది అతిధుల కోసం మూడు ప్రాంతాలకు సంబంధించిన రుచికరమైన వంటలను సిద్దం చేస్తున్నారు. ఘుమఘుమలాడే రకరకాల బిర్యానీల నుంచి డిఫరెంట్ వెరైటీస్‌తో నోరూరించే శాకాహార వంటకాల దాకా అన్నీ సిద్ధమవుతున్నాయి.
వైఎస్సార్ జయంతి సందర్భంగా పంజాగుట్ట చౌరస్తాలోని వైఎస్సార్ విగ్రహానికి కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పీసీసి చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా హైదరాబాద్ సిటీ
సెంట్రల్ వద్ద ఉన్న వైయస్సార్ విగ్రహానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావుతో కలిసి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారి వెంట
ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ మాజీ అధ్యక్షులు కుసుమ కుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.
గన్నవరం విమానాశ్రయం నుంచి బయలు దేరిన సీఎం జగన్
మరికాసేపట్లో ప్లీనరీ సమావేశం సభా ప్రాంగణానికి సీఎం జగన్, విజయమ్మ రానున్నారు.
గుంటూరు జిల్లా కాజా బయల్దేరిన సీఎం జగన్..
వైసీపీ ప్లీనరీ సందర్భంగా సీఎం జగన్ జెండాను ఆవిష్కరించారు.
కాసేపట్లో వైసీపీ ప్లీనరీ ప్రారంభంకాబోతోంది. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ఎదుట రెండ్రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ముందుగా పార్టీ జెండా, ఆ తర్వాత వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం జగన్. ఇక కాసేపట్లో ప్రసంగించనున్న సీఎం జగన్ స్పీచ్‌పై ఉత్కంఠ నెలకొంది.
– వైసీపీ ప్లీనరీ వద్ద ప్రత్యేక ఆకర్షణగా పోలవరం ప్రాజెక్టు నమూనా
– పోలవరం ప్రాజెక్టు నమూనా ఏర్పాటు చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి..
– పోలవరం నమూనాతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు
– పోలవరం నమూనా వద్ద ఫోటోలు దిగుతున్న వైసీపీ కార్యకర్తలు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో వైసిపి ప్లీనరీ సందర్బంగా ప్రకాశంజిల్లాలో ట్రాఫిక్ మళ్లిస్తున్నారు.. నేడు, రేపు వైసిపి ప్లీనరీ జరుగుతుండడంతో హైవేపై వాహనాల క్రమబద్దీకరణ కోసం పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమలులో ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉండనున్నాయి.
వైసీపీ ప్లీనరీ పనుల కోసం 20 ప్రత్యేక కమిటీలు
వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో 3 వేల మంది వలంటీర్లు పాల్గొంటున్నారని ప్లీనరీ వలంటీర్స్ కమిటీ కన్వీనర్, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 73వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ, షర్మిల కూడా నివాళులర్పించారు. మహానేత వైఎస్సార్ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
వైసీపీ టార్గెట్ 2024 ప్లీనరీ: ఈ ప్లీనరీ వేదికగానే వైసీపీ అధినేత జగన్ ఎన్నికల సమర శంఖం పూరించనున్నారు.నేడు,రేపు జరిగే ఈ ప్లీనరీలో కీలక ప్రకటనలు ఉంటాయని అంతా భావిస్తున్నారు.ప్లీనరీలో 9 తీర్మానాలపై చర్చించే అవకాశం
వైఎస్ఆర్‌సీపీ ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. దీనికోసం భారీ ఏర్పాల్లు చేశారు.
ప్లీనరీ వేదికకు వైఎస్ఆర్ ప్రాంగణంగా నామకరణం చేశారు. ఈ ప్లీనరీలో వంగపండు బృందం.. వైసీపీ విశిష్టత.. ప్రభుత్వ పథకాల గురించి పాటల రూపంలో తెలియజేయనుంది.
– ఉదయం 8 గంటలకు పార్టీ ప్రతినిధుల నమోదు తో ప్రారంభం కానున్న ప్లీనరీ.
– ఉదయం 10 గంటలకు పార్టీ జెండా ఆవిష్కరించనున్న సీఎం జగన్.
– 10.55 కి పార్టీ అధ్యక్ష ఎన్నికకు ప్రకటన విడుదల.
– ఉదయం 11 గంటలకు అధ్యక్షుడి హోదాలో జగన్ ప్రారంభోపన్యాసం.
– ఉదయం 11.15 కి పార్టీ నియమావళి లో సవరణలు ప్రవేశపెట్టనున్న నేతలు
– మధ్యాహ్నం 12 గంటల నుంచి తీర్మానాలు ప్రవేశపెట్టనున్న పార్టీ నేతలు.
– మొదటి రోజు ఐదు తీర్మానాలను ఆమోదించనున్న ప్లీనరీ.
ఇవాళ, రేపు జరగనున్న వైసీపీ మూడో ప్లీనరీ కోసం భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా 40 ఎకరాల ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటి రోజు లక్ష మంది వస్తారని అంచనా వేస్తున్నారు.