MLA Roja: అమరరాజా వ్యవహారంలో టీడీపీ రాద్ధాతం చేస్తోంది.. పార్టీ సమస్య కాదు.. పొల్యూషన్ సమస్యః రోజా

|

Aug 06, 2021 | 1:48 PM

అమర రాజా కంపెనీ తరలింపు నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నగరి ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమర రాజాది రాజకీయ సమస్య కాదు.. పొల్యూషన్ సమస్య అన్నారు.

MLA Roja: అమరరాజా వ్యవహారంలో టీడీపీ రాద్ధాతం చేస్తోంది.. పార్టీ సమస్య కాదు.. పొల్యూషన్ సమస్యః రోజా
Mla Roja
Follow us on

MLA Roja Comments on Amararaja: అమర రాజా కంపెనీ తరలింపు నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నగరి ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమర రాజాది రాజకీయ సమస్య కాదు.. పొల్యూషన్ సమస్య అని రోజా అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, అమర రాజా ఫ్యాక్టరీ వ్యవహారంలో తెలుగు దేశం పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. అమరరాజాతో పాటు 54 ఫ్యాక్టరీలకు నోటీసులు ఇచ్చారన్నారు. గతంలో విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ ఘటనపై చంద్రబాబు గగ్గోలు పెట్టారని.. ప్రాణాలతో ఆడుకుంటున్న అమర్‌రాజా ఫ్యాక్టరీపై ఎందుకు మాట్లాడటం లేదని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు.

ఇదిలావుంటే, అమరరాజా కంపెనీని తామే వెళ్లిపొమ్మని చెబుతున్నామని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల ప్రకటించారు. ఆ సంస్థ వెళ్లిపోవడం కాదు .. తామే పంపేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఆ పరిశ్రమ పూర్తిగా కాలుష్య కారకమని ఆయన చెప్పారు. అమరరాజా సంస్థ తమిళనాడులో పెట్టుబడులు పెట్టబోతోందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అమర రాజా సంస్థ కాలుష్యాన్ని వెద జల్లుతోందని ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింప చేస్తోందని..అది విష తుల్యమైన పరిశ్రమ అని ఎమ్మెల్యే రోజా విరుచుకుపడ్డారు. కాలుష్యం లేని పరిశ్రమల అవసరం ఉందని చెప్పుకొచ్చారు.

సొంత జిల్లా ప్రజలకు ఉపాధి మార్గాలు కల్పించాలన్న లక్ష్యంతో గల్లా రామచంద్రనాయుడు అమెరికా నుంచి వచ్చి చిత్తూరులో బ్యాటరీ పరిశ్రమను ఏర్పాటు చేశారు. అంచెలంచెలుగా దిగ్గజ కంపెనీగా రూపొందించారు. గల్లా అరుణకుమారి కాంగ్రెస్‌లో కీలకనేతగా ఉన్నా పరిశ్రమపై ఎప్పుడూ రాజకీయ నీడ పడనీయలేదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. పరిశ్రమల జోలికి వెళ్లలేదు. కానీ ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి రాగానే కాలుష్యం పేరుతో నిబంధనల ఉల్లంఘన అని మరోసారి భూములు వెనక్కి తీసుకోవడం.. ప్లాంట్ ను మూసివేయమని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అమరరాజా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటోంది.

Read Also…  Somu Veerraju: ‘అలా ఎందుకు జరగడం లేదో అర్థం కావడం లేదు’ అంటూ అయోమయంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.!