Vijayasai Reddy: ప్రధాని మోడీతో కలిసి సీఎం జగన్ లంచ్.. చంద్రబాబుపై విజయసాయి రెడ్డి సెటైర్లు..

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ.. రెండు నిమిషాలు మాట్లాడితేనే చంద్రబాబు ఎంతో ప్రచారం చేసుకున్నారని..

Vijayasai Reddy: ప్రధాని మోడీతో కలిసి సీఎం జగన్ లంచ్.. చంద్రబాబుపై విజయసాయి రెడ్డి సెటైర్లు..
Vijaysai Chandrababu

Edited By: Ravi Kiran

Updated on: Aug 09, 2022 | 4:01 PM

Vijayasai Reddy on Chandrababu Naidu: వైఎస్ఆర్‌సీపీ నాయకుడు, ఎంపీ వి. విజయసాయి రెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. బాబు పరాన్న జీవి అంటూ విమర్శించారు. ఇటీవల చంద్రబాబుకు ఢిల్లీ నుంచి పిలుపువచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబుతో ప్రధాని మోడీ ముచ్చటించారు. అనంతరం జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోడీ.. సీఎం జగన్‌తో కూడా ముచ్చటించారు. ఏకంగా ప్రధాని మోడీ కూర్చున్న లంచ్ టేబుల్‌‌పై భోజనం చేసే సీఎం జగన్‌కు అవకాశం లభించింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌‌తో మోడీ పలు విషయాలపై మాట్లాడారు. దీంతో అటు ఏపీతోపాటు.. ఇటు ఢిల్లీ రాజకీయాల్లో సీఎం జగన్ హాట్ టాపిగ్ గా నిలిచారు. ఈ క్రమంలో విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ.. రెండు నిమిషాలు మాట్లాడితేనే చంద్రబాబు ఎంతో ప్రచారం చేసుకున్నారని.. అదే మోడీతో సీఎం జగన్‌ లంచ్ చేశారంటూ పేర్కొన్నారు. ప్రజల్లో స్వయం ప్రకాశం లేని బాబు అంటూ విమర్శించారు.

AP CM YS Jagan Having Lunch With PM Modi

విజయసాయి రెడ్డి ట్విట్స్..

ఇవి కూడా చదవండి

‘‘నీతీ ఆయోగ్‌ సమావేశం లంచ్ విందులో ప్రధాని టేబుల్‌ నెంబర్:1 కు ఆహ్వానితులుగా ముగ్గురు ముఖ్యమంత్రులు, ఇద్దరు లెఫ్టినెంట్‌ గవర్నర్లు ఉన్నారు. ఆ ముగ్గురిలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకరు.

కాకపోతే, గంటకు పైగా ఒకే టేబుల్‌ దగ్గర లంచ్ విందులో మాట్లాడుకున్నా ప్రచారం కోరుకోని జగన్‌గారి స్థాయి ఎక్కడ? నిలబడి ప్రధాని తనతో రెండు నిమిషాలు మాట్లాడినందుకు అయిదు గంటలకు సరిపడ కట్టుకథ అల్లిన బాబు ఆయన పచ్చకులమీడియా స్థాయి ఎక్కడ?

ప్రజల్లో స్వయం ప్రకాశం లేని బాబు.. 1994లో వెన్నుపోటుతో అధికారం లాక్కుని, 1999లో కార్గిల్‌ యద్ధం వల్ల; 2019లో మోడీగారి గాలిలో అధికారంలోకి రావటం తప్పితే.. సొంతంగా ఒక్కసారి కూడా గెలిచింది లేదు.

ఇలాంటి వారిని ఇంగ్లీష్‌లో పేరసైట్స్ అంటారు. అంటే.. పరాన్న జీవులు! ఢిల్లీలోని అన్ని పార్టీల ఇళ్ళలోనూ తిని… అందరి ఇళ్ళ వాసాలూ లెక్కపెట్టిన ఈ చంద్రబాబు అనే ద్రోహిని ఎవరైనా మళ్ళీ కలుద్దాం, మా ఇంటికి రండి అని ఎందుకు అంటారు?’’ అంటూ విజయసాయి రెడ్డి వరుస ట్వీట్లు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయాలి..