Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MP Midhun Reddy: ప్రత్యేక హోదా కోసం ఏ పార్టీకైనా మద్దతిస్తాం.. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Andhra Pradesh special status: ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ ప్యాకేజీ.. ఇది ఎప్పటినుంచే వినిపిస్తున్నమాట.. తెలుగు రాష్ట్రల విభజన అనంతరం స్పెషల్ స్టేటస్ వ్యవహారం దాదాపు.. 9 ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది.

MP Midhun Reddy: ప్రత్యేక హోదా కోసం ఏ పార్టీకైనా మద్దతిస్తాం.. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Mp Midhun Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 05, 2023 | 9:26 AM

Andhra Pradesh special status: ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ ప్యాకేజీ.. ఇది ఎప్పటినుంచే వినిపిస్తున్నమాట.. తెలుగు రాష్ట్రల విభజన అనంతరం స్పెషల్ స్టేటస్ వ్యవహారం దాదాపు.. 9 ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర విభజన హామీల్లో ఒకటైన వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ అంశం.. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో తాజాగా.. తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ప్రకటిస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. దీనికోసం కేంద్రం కసరత్తు చేస్తుందని.. ఇవ్వాల్టి సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో క్లారిటీ వస్తుందని పేర్కొంటున్నారు. ఇవ్వాళ జరగనున్న కేంద్ర కేబినేట్ సమావేశంలో దీని గురించి చర్చ జరుగుతుందని.. ఈ కసరత్తు పూర్తయితే రూ. 22 వేల కోట్లతో స్పెషల్ ప్యాకేజీ ప్రకటిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ ఫ్లోర్‌ లీడర్‌, ఎంపీ మిథున్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రత్యేక హోదా ఇస్తామంటే ఏ పార్టీకైనా తమ మద్దతు ఉంటుందని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి స్పష్టంచేశారు. సీఎం జగన్‌ ఢిల్లీ టూర్‌పై స్పందించిన ఆయన.. బీజేపీతో ఎలాంటి ఇంట్రనల్‌ రిలేషన్‌షిప్స్‌ లేవన్నారు. బీజేపీ-వైసీపీ మధ్య కేవలం.. ఒక సీఎంకి పీఎంకి ఉండాల్సిన సంబంధాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే.. గతంలో ఏపీకి చంద్రబాబు సాధించలేనివి సీఎం జగన్‌ సాధించారని గుర్తు చేశారు. ఇక.. వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులుండవని.. వైసీపీ సింగిల్‌గానే పోటీ చేస్తుందని ఎంపీ మిథున్‌రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఏ పార్టీకైనా మద్దతు ఇస్తామని.. రాష్ట్ర అభివృద్ధే తమ ఎజెండా అని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..