MLA Prasanna Kumar: నెల్లూరు ఎస్పీ భాస్కర్ భూషణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి

MLA Prasanna Kumar: నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్‌ టార్గెట్‌గా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన..

MLA Prasanna Kumar: నెల్లూరు ఎస్పీ భాస్కర్ భూషణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి

Updated on: Jan 18, 2021 | 1:42 PM

MLA Prasanna Kumar: నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్‌ టార్గెట్‌గా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఎస్పీ భాస్కర్ భూషణ్ టీడీపీకి ఫేవర్‌గా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. సోమవారం నాడు కోవూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. భాస్కర్ భూషణ్ జిల్లా ఎస్పీలా కాకుండా టీడీపీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి రావుపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

పైగా.. పోస్టులు పెట్టిన వారిపై అట్రాసిటీ కేసులు పెట్టొద్దంటూ అధికారులకు ఎస్పీ ఫోన్ చేసి చెప్పారని ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రి చెప్పడం వల్లే.. ఎస్పీ వారిపై కేసులు పెట్టకుండా అడ్డుకున్నారంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అయితే ఎస్పీ విధానాలు సరికావని, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉందనే విషయాన్ని గుర్తెరగాలని ఎస్పీ భాస్కర్ భూషణ్‌కు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి రావుపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టింది టీడీపీ నేతలే అని ఆరోపించిన ఆయన.. సదరు వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Also read:

Former Chief Minister: నా భార్యను ముద్దు పెట్టుకోలేకపోతున్నా; ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ ముఖ్యమంత్రి..

Suicide in Adilabad: ఆర్మీ ఉద్యోగానికి పనికిరానని యువకుడి ఆత్మహత్య.. కారణాలు ఇలా ఉన్నాయి..