Andhra Pradesh: రజనీకాంత్‌కు రాజకీయ సెగ.. మరి చంద్రబాబును మెచ్చుకుంటే వైసీపీ నేతలు ఊరుకుంటారా..

|

Apr 29, 2023 | 2:57 PM

సీనియర్‌ ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన సినీ నటుడు రజనీకాంత్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి రేపారు. ఈ వేడుకలో రజనీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు విరుచుకుపడుతున్నారు. వైసీపీ మంత్రి రోజా రజనీకి కౌంటర్‌ అటాక్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ..

Andhra Pradesh: రజనీకాంత్‌కు రాజకీయ సెగ.. మరి చంద్రబాబును మెచ్చుకుంటే వైసీపీ నేతలు ఊరుకుంటారా..
Rajinikanth
Follow us on

సీనియర్‌ ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన సినీ నటుడు రజనీకాంత్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి రేపారు. ఈ వేడుకలో రజనీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు విరుచుకుపడుతున్నారు. వైసీపీ మంత్రి రోజా రజనీకి కౌంటర్‌ అటాక్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. ‘రజనీకాంత్‌తో చంద్రబాబు అబద్ధాలు చెప్పించారు. ఎన్టీఆర్‌ ఏమన్నారో.. రజనీకాంత్‌కు వీడియోలు ఇస్తాను. ఎన్టీఆర్‌పై దారుణంగా కార్టూన్లు వేసి అవమానించిన వ్యక్తి చంద్రబాబు. రజనీకాంత్‌కు తెలుగు రాష్ట్రం, రాజకీయాలపై అవగాహన లేదు. రజనీకాంత్‌ వ్యాఖ్యలతో ఎన్టీఆర్‌ ఆత్మ కూడా బాధపడుతుంది. ఎన్టీఆర్‌ అభిమానులను బాధపట్టేలా రజనీకాంత్‌ మాట్లాడారు’ అని అన్నారు.

రజనీ నిజాయితీ లేకుండా మాట్లాడుతున్నారు..

ఇక రజనీ కాంత్‌ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి కూడా విమర్శించారు. రజినీకాంత్ నీతి నిజాయితీ లేకుండా మాట్లాడుతున్నారన్న ఆమె.. రజినీకాంత్‌కు ఎన్టీఆర్‌ టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇచ్చి గౌరవించారని గుర్తు చేశారు. చంద్రబాబులో ఏం విజనరీ కనిపించిందో చెబితే బాగుండేదన్నారు. చంద్రబాబు అమరావతిని, పోలవరాన్ని ముంచేశాడన్న లక్ష్మీ పార్వతి.. ‘ఆనాడు ఎన్టీఆర్‌ రజినీకాంత్ వ్యతిరేకంగా ప్రవర్తించారు. చంద్రబాబుకు మద్దతు పలికితే ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుంది. జయలలితను ఓడించేందుకు ఎంత హంగామా చేసినా రజనీ గెలవలేకపోయాడు’ అంటూ చురకలు అంటించారు.

రజనీకాంత్‌ను రంగంలోకి దించింది అందుకే: కొడాలి నాని

ఇక రజనీ వ్యాఖ్యలపై గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని సైతం ఫైర్‌ అయ్యారు. రజినీకాంత్‌కాంత్‌పై సంచల వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌ను బ్లాక్ మెయిల్ చేసేందుకే… రజినీకాంత్ ను,చంద్రబాబు రంగంలోకి దించాడన్న కొడాలి.. పవన్ కళ్యాణ్‌ ఇప్పటికైనా చంద్రబాబు రాజకీయాలను గ్రహించాలని చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్‌పై చెప్పులు విసురుతుండగా, వైస్రాయ్ హోటల్లో చంద్రబాబుకు రజినీకాంత్ మద్దతు తెలిపారని మండిపడ్డారు. అదే వ్యక్తి ఇప్పుడు ఎన్టీఆర్‌ను పొగడడం సిగ్గుచేటంటూ విరుచుకుపడ్డారు. మూడు రోజులు షూటింగ్‌ చేస్తే.. నాలుగు రోజులు హాస్పిటల్‌లో ఉండే రజనీకాంత్‌ తెలుగు ప్రజలకు ఏం చెప్తాడని కొడాలి ప్రశ్నించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతూ రజనీ మరింత దిగజారుతున్నారు అంటూ ఘూటాగా వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..