AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP: ఉద్యోగులు ఇలా చేయడం మంచిది కాదు.. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి.. వైసీపీ నాయకుల విజ్ఞప్తి

YSRCP leaders on Employees: ఏపీ ప్రభుత్వం - ఉద్యోగుల మధ్య ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉద్యోగుల తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన

AP: ఉద్యోగులు ఇలా చేయడం మంచిది కాదు.. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి.. వైసీపీ నాయకుల విజ్ఞప్తి
Ap Employees
Shaik Madar Saheb
|

Updated on: Feb 03, 2022 | 1:22 PM

Share

YSRCP leaders on Employees: ఏపీ ప్రభుత్వం – ఉద్యోగుల మధ్య ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉద్యోగుల తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ ఉద్యోగులను అడ్డుకుంటున్నారు. చర్చల ద్వారానే ఉద్యోగులు సమస్యలను పరిష్కరించుకోవాలని అధికార వైఎస్ఆర్‌సీపీ నాయకులు సూచిస్తున్నారు. ఉద్యోగులు రోడ్డు ఎక్కినత మాత్రాన విజయం సాధించినట్టు కాదంటూ అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వంతోనే చర్చలు జరపకుండా.. రాజకీయ నేతల్లా ఉద్యమాలు చేయడం సరికాదంటూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు (malladi vishnu) సూచించారు. ప్రభుత్వంతో చర్చిస్తేనే సమస్య పరిష్కారమవుతుందన్నారు. రాజకీయ నేతలు లాగా ఉద్యమాలు చేస్తున్నారు.. ఉద్యోగులు ట్రాప్ లో పడినట్లుగా అనిపిస్తుందన్నారు. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్ ఉద్యోగుల జీతాలు పెంచారు. పీఆర్సిపై ప్రభుత్వం కట్టుబడి ఉంది. పోలీసులు ఉద్యోగుల పట్ల చూసి చూడనట్టు వ్యవహరించారని.. దీంతో రకరకాల వేషాలు వేసుకొని ఛలో విజయవాడ (Chalo Vijayawada) కు రావటం సిగ్గుగా ఉందన్నారు. గత ప్రభుత్వంలాగా ఉద్యోగులను సస్పెండ్ చేసి ప్రజల ముందు దోషులను చేయలేదని.. ఉద్యోగస్తులు సానుకూలమైన దృక్పథంతో ఆలోచించాలని సూచించారు. చర్చల ద్వారానే ఉద్యోగుల సమస్య పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు.

చర్యలు తప్పవు.. మాజీ ఎంపీ హెచ్చరిక

ఉద్యోగుల ఆందోళనపై మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి (modugula venugopala reddy) సైతం మాట్లాడారు. డిమాండ్‌తో రావడం కాదు, రిక్వెస్ట్ మోడ్‌తో రావాలని సూచించారు. ఉద్యోగులకు ప్రభుత్వం ఎప్పుడు తలుపులు తెరిచి ఉంటుందన్నారు. రిక్వెస్ట్‌గా అడిగితే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. బాధ్యత రాహిత్యంగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తామంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగులు ఆందోళనకు దిగితే ప్రజలే తిరుగుబాటు చేస్తారని పేర్కొన్నారు. జిన్నాలో ముస్లింను చూడలేదు.. గాంధీలో హిందువును చూడలేదని మోదుగుల పేర్కొన్నారు. బీజేపీ పనికిరాని పార్టీ‌ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రా కిష్ర్టియన్ కాలేజ్ కి అబిత్ షా కాలేజ్ అని పెడతారా..? అంటూ ప్రశ్నించారు. హిందూ ముస్లింలు కలిసి ఉండాలని జిన్నా కోరుకున్నారని తెలిపారు. ముస్లింలు ఈ దేశంలో ద్వితీయ పౌరులు కాదని ప్రధమ పౌరులని పేర్కొన్నారు.

మంచిది కాదు.. ఎమ్మెల్యే జోగి రమేష్..

ఉద్యోగులు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ (jogi ramesh) సూచించారు. బాధ్యతగల ఉద్యోగులు రాష్ట్ర పరిస్థితి అర్ధం చేసుకోవాలన్నారు. ఛలో విజయవాడ లాంటి కార్యక్రమాలు ప్రజలకు, మీకు మంచిది కాదంటూ సూచించారు. కోవిడ్ విజృంభిస్తున్న వేళ ఇలాంటి ఆందోళనతో వ్యాపి మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. నిర్బందించినట్లయితే ఇంత మంది వచ్చేవారా..? కట్టడి చేస్తే రాగలరా.. అంటూ జోగి రమేష్ మండిపడ్డారు. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఫ్రెండ్లీగా ఉందని.. ఉద్యోగులగా ఆలోచన ఉండక్కర్లేదా..? మనది ఒక కుటుంబం కదా.. అంటూ పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కోరుకునే వారు ఇలా జఠిలం చేసుకుంటారా…? అంటూ జోగి రమేష్ పేర్కొన్నారు.

Also Read:

Watch Video: మాస్కులు ధరించి తుపాకులతో వచ్చారు.. రూ. కోటి ఎత్తుకెళ్లారు.. పట్టపగలే దొంగల బీభత్సం .. వీడియో

MLA Raja Singh: దళితులతో పెట్టుకుంటే అంతే.. సీఎం కేసీఆర్ కామెంట్స్‌పై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్..