బెజవాడలో అన్నాదమ్ముల్ల మధ్య సవాళ్లు.. ప్రతిసవాళ్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అన్న ఒకటంటే.. తమ్ముడు రెండంటూ పాలిటిక్స్ ను మరింత హీటు పెంచుతున్నారు. విజయవాడలో టీడీపీ 60 శాతం ఖాళీ అవ్వడం ఖాయమంటూ వైసీపీ నేత కేశినేని నాని పేర్కొన్నారు. అవసరం అయితే వందశాతం ఖాళీ చేయిస్తాన్నారు. కేశినేని చిన్నివి ఉత్తరకుమార ప్రగల్భాలు అంటూ పేర్కొన్న నాని… తన స్థాయి చంద్రబాబు స్థాయి.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు పడితే వాళ్లకు సమాధానం ఇవ్వనంటూ. బుద్ధా వెంకన్న, కేశినేని చిన్నిపై నాని సెటైర్లు వేశారు. కాల్ మనీ వ్యాపారస్తుల మాటలకు స్పందించాల్సిన అవసరం తనకు లేదని.. తన గురించి మాట్లాడే వాళ్లు.. వాళ్ల స్థాయి ఏంటో తెలుసుకుంటే బాగుంటుందని కేశినేని నాని పేర్కొన్నారు.
కాగా.. టీడీపీని 60శాతం ఖాళీ చేస్తానని నాని చేసిన వ్యాఖ్యలకు కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. మీ వాళ్లనే మేం లాగేసుకుంటాం అంటూ ప్రతి సవాల్ చేశారు. తమ్ముడు అంతమాటంటే అన్న ఊరుకుంటారా.. మీకు అంత సీన్ లేదు అంటూ పేర్కొన్నారు కేశినేని నాని.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..