AP Politics: అనంత పాలిటిక్స్‌లో జాకీ మంటలు.. రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో రచ్చ.. రచ్చ.. ఇంతకీ ఏం జరిగుతోందంటే..

|

Nov 27, 2022 | 7:16 PM

జాకీతో మొదలైంది.! రాప్తాడు, ధర్మవరంలో రచ్చ రాజేసింది. అనంతపురం జిల్లాను హీటెక్కించింది.! మాటలు మంటలు రేపాయి. ఇష్యూ రాళ్ల దాడులు, ఆందోళనలు, అరెస్ట్‌లు వరకూ వెళ్లింది..! పొలిటికల్ విమర్శలు కాస్తా పక్కదారి పట్టాయి. వ్యక్తిగత దూషణలు హద్దులు దాటాయి..! ఇంతకీ ఏం జరిగింది? ఏం జరగబోతోంది?

AP Politics: అనంత పాలిటిక్స్‌లో జాకీ మంటలు.. రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో రచ్చ.. రచ్చ.. ఇంతకీ ఏం జరిగుతోందంటే..
Ap Politics
Follow us on

అద్దాలు పగిలాయి.! ఆ తర్వాత సీన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. ధర్నాలు, నినాదాలు, మామూలుగా లేదు హీట్. నిన్నటి నుంచి ఒకటే టెన్షన్..! జాకీ పరిశ్రమ తరలిపోవడంపై గత కొంతకాలంగా వైసీపీ- టీడీపీ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం.. ఇలా ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది..! రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్న తోపుదుర్తి చందు ఒకవైపు… టీడీపీ నేత జగ్గు మరోవైపు.. ఈ ఇద్దరూ మాట్లాడిన మాటలే అనంత జిల్లా వ్యాప్తంగా మంటలు రేపాయి..! తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అయ్యాయి. వివాదం కాస్తా పరిటాల వర్సెస్ తోపుదుర్తి ఫ్యామిలీగా మారిపోయింది. తీవ్ర పదజాలంతో దూషించిన టీడీపీ కార్యకర్త జగ్గుని అర్ధరాత్రి చెన్నేకొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన కోసం చెన్నే కొత్తపల్లి వెళ్లి తిరిగి వస్తుండగా టీడీపీ నేతలపై దాడి జరిగింది. ఇది కనగానపల్లి వైసీపీ నేతల పనే అన్నది టీడీపీ ఆరోపణ..!

జగ్గును చెన్నేకొత్తపల్లి నుంచి ధర్మవరం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అక్కడ మొదలైంది మరో రచ్చ. పరిటాల సునీత సహా పార్టీ శ్రేణులు ధర్మవరం పోలీస్ స్టేషన్‌కు భారీగా చేరుకున్నాయి. రోడ్డుపైనే బైఠాయించి ధర్నా చేశారు. ఆందోళనకారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఖబర్దార్ అంటూ ప్రకాష్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు పరిటాల సునీత.

టీడీపీకి కౌంటర్‌గా వైసీపీ శ్రేణులు కూడా ధర్మవరం పోలీస్ స్టేషన్‌ వద్దకు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మీ ఫిర్యాదు మేరకే  ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్న హామీతో తెలుగుదేశం నేతలు శాంతించారు. అటు టీడీపీ తీరు మళ్లీ ఫ్యాక్షన్‌ రాజకీయాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు..  ఒక ఎమ్మెల్యే తల్లిని కిరాయి హంతకుడు దూషిస్తే అతని కోసం పరిటాల సునీత ధర్నాలు చేయడం ఏంటని ప్రశ్నించారు ఎంపీ గోరంట్ల మాధవ్.

విశాఖ టూర్‌లో ఉన్న ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నటైమ్‌లో అక్కడికి టీడీపీ శ్రేణులు చేరుకోవడంతో కాసేపు టెన్షన్‌ నెలకొంది పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మొత్తానికి జాకీ పరిశ్రమ తరలింపుతో మొదలైన వివాదం.. భౌతిక దాడులు, వ్యక్తిగతదూషణల వరకూ వెళ్లింది. ప్రస్తుతానికి ఇరు వర్గాలు శాంతించినప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మాత్రం కంటిన్యూ అవుతోంది.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం