Andhra Pradesh: జోరుగా పెన్షన్ల పంపిణీ.. అవాంతరాలు ఏర్పడకుండా పక్కాగా ఏర్పాట్లు.. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు అందజేత..

వయోభారం, ఒంటరితనం, ఆదరణకు నోచుకోని వారిని జగన్ ప్రభుత్వం చేరదీస్తోంది. నెలనెలా వైఎస్సార్ పెన్షన్ల రూపంలో వారికి ఆర్ధిక సహాయం అందజేస్తూ బాసటగా నిలుస్తోంది. క్యూ లైన్లలో నిలబడి పింఛన్ తీసుకునే..

Andhra Pradesh: జోరుగా పెన్షన్ల పంపిణీ.. అవాంతరాలు ఏర్పడకుండా పక్కాగా ఏర్పాట్లు.. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు అందజేత..
Ysr Pensions

Updated on: Oct 01, 2022 | 11:01 AM

వయోభారం, ఒంటరితనం, ఆదరణకు నోచుకోని వారిని జగన్ ప్రభుత్వం చేరదీస్తోంది. నెలనెలా వైఎస్సార్ పెన్షన్ల రూపంలో వారికి ఆర్ధిక సహాయం అందజేస్తూ బాసటగా నిలుస్తోంది. క్యూ లైన్లలో నిలబడి పింఛన్ తీసుకునే పరిస్థితులు రాకుండా.. ఇంటింటికీ వెళ్లి నగదు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. వాలంటీర్లు లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి నగదు అందజేస్తున్నారు. 62.53 లక్షల మంది పెన్షనర్లకు ప్రభుత్వం రూ.1590.50 కోట్లు విడుదల చేసింది. సాంకేతిక కారణాలు తలెత్తకుండా.. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పింఛన్‌ అందిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. సెప్టెంబర్ నెలకు గానూ 62.53 లక్షల మందికి రూ.1,590.50 కోట్లు పంపిణీ చేశారు. తమది మహిళల ప్రభుత్వమని, వారి జీవితాల్లో మార్పు కనిపిస్తోందని సీఎం జగన్ అన్నారు. అమ్మ ఒడి ద్వారా అక్కా చెల్లెళ్లకు తోడుగా నిలబడ్డామని పేర్కొన్నారు. లంచాలు, మధ్యవర్తులు, వివక్షకు తావు లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని ముఖ్యమంత్రి వైఎస్.జగన్ స్పష్టం చేశారు.

కాగా.. గతంలో చిత్తూరు జిల్లా కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఇచ్చే మొత్తాన్ని పెంచారు. వచ్చే ఏడాది జనవరి నెల నుంచి పింఛన్లను రూ.2,750 కి పెంచుతున్నట్లు వెల్లడించారు. దీంతో ప్రస్తుతం రూ.2,500 ఉన్న పెన్షన్ రూ.2,750 కానుంది. ఇక అదే నెలలో మూడో దఫా వైఎస్ఆర్ ఆసరా కూడా అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కుప్పం పర్యటనలో భాగంగా వైఎస్సార్ చేయూత కింద మూడో విడత నిధులను విడుదల చేశారు.

రాష్ట్రంలో వయో వృద్ధులకు, అర్హులైన వారికి ప్రభుత్వం వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద పెన్షన్‌ అందిస్తోంది. గ్రామ వలంటీర్లు స్వయంగా లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి నగదు పంపిణీ చేస్తున్నారు. సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన పెన్షన్‌లను అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అందించనున్నారు. గత ప్రభుత్వం మధ్యలో పెన్షన్‌లను తగ్గించేందుకు ప్రయత్నం చేస్తే వైఎస్సార్‌ సర్కార్‌ అధికారంలోకి రాగానే అర్హులైన వారందరికీ పెన్షన్‌లను మంజూరు చేసింది.ప్రతి నెల 1వ తేదీన అందిస్తున్న పెన్షన్లు ఒక పెద్దకొడుకు కంటే ఎక్కువ బాధ్యత తీసుకుంటున్న సీఎం జగన్‌మోహన్ రెడ్డికి ఈ జన్మంతా రుణపడి ఉంటామని లబ్ధిదారులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం చూడండి..