YS Viveka: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. సీబీఐ విచారణకు హాజరుకాలేనన్న భాస్కర్ రెడ్డి..
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ విచారణకు హాజరుకాలేనన్నారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి. వ్యక్తిగత పనులు, ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయని, విచారణకు హాజరు కాలేనంటూ సీబీఐకి..
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ విచారణకు హాజరుకాలేనన్నారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి. వ్యక్తిగత పనులు, ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయని, విచారణకు హాజరు కాలేనంటూ సీబీఐకి సమాచారం ఇచ్చారు భాస్కర్ రెడ్డి. దాంతో భాస్కర్ రెడ్డి తదుపరి విచారణకు మరోసారి నోటీస్ ఇచ్చేందుకు సిద్ధమైంది సీబీఐ. ఈ నోటీసులు అందుకున్నాక విచారణకు కావాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. కాగా, శుక్రవారం నాడు సీబీఐ విచారణకు హాజరుకానున్నారు అవినాష్ రెడ్డి. మరోవైపు ఈ కేసులో స్పీడ్ పెంచిన సీబీఐ.. బుధవారం నాడు హైదారాబాద్ సీబీఐ కోర్టులో 68 పేజీలతో చార్జ్‌షీట్ దాఖలు చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..