వైఎస్ వివేకా నాలుగో వర్ధంతి సందర్భంగా తండ్రి సమాధి దగ్గర నివాళులర్పించారు ఆయన కుమార్తె సునీత. కేసు విచారణ దశలో ఉండగా ఏం మాట్టాడనన్నారు. తనకు తెలిసిన విషయాలన్నీ సీబీఐకి చెప్పానన్నారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను ప్రభావితం చేయకూడదని, పోలీసుల మీద ఒత్తిడి పెట్టకుండా వాళ్ల పనివాళ్లని చేయనియ్యాలన్నారు. వివేకా హత్య కేసులో ఉన్నది ఎవరైనా సరే..ఎంతటివారైనా సరే బయటకు రావాలని, పిల్లలు తప్పు చేస్తే ఖండిస్తాం..అలాగే పెద్దలు తప్పు చేసినా వదిలిపెట్టకూడదన్నారు. అప్పుడే వ్యవస్థ బాగుపడుతుందని ఆమె చెప్పారు.
కడపలో అరాచకాలు తగ్గాయనుకున్నా..కానీ తగ్గలేదన్నారు. తప్పు చేసినవారికి శిక్ష పడితేనే.. మరొకరికి తప్పు చేయాలంటే భయం వేస్తుందన్నారు. ఇట్లాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదు అన్నారు. ఆ ధ్యేయంతో తన పోరాటం సాగుతుందన్నారు. తన ఫైట్‌కు సహకారం అందిస్తున్న అందరికీ ఆమె.. ధన్యవాదాలు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి