ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి జగన్ విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తప్పించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీలకు తనదే హామీ అంటూ ఎన్నికల సమయంలో చెప్పిన చంద్రబాబు… ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చాక రాష్ట్రం బాధ్యత ప్రజలదంటూ తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రమాణస్వీకారం చేసిన తొలి క్షణంనుంచే సీఎం ప్లేటు ఫిరాయించారన్నారు. ఖజానా ఖాళీ అంటూ తప్పుడు శ్వేతపత్రాలు విడుదల చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు. అప్పులకు వడ్డీలుకట్టడానికే డబ్బుల్లేవంటున్న చంద్రబాబు లేని అప్పులు ఉన్నట్టుగా, వాటికి లేని వడ్డీలు కడుతున్నట్టుగా పదేపదే మాట్లాడి ప్రజలను మాయచేసే ప్రయత్నంచేస్తున్నారని విమర్శించారు.
తల్లికి వందనం రాలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, మత్స్యకార భరోసా అడ్రస్సే లేదన్నారు. ప్రతి ఇంటికీ ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి ఇస్తానన్న మాట కూడాచంద్రబాబు నిలబెట్టుకోలేకపోయారని మండిపడ్డారు. వాలంటీర్లను మోసం చేశారని, విత్తనాలకోసం రైతులు క్యూలో నిలబడే పరిస్థితిని తీసుకు వచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో లా అండర్ ఆర్డర్ పూర్తిగా గాడితప్పిందని, ఏపీలో రెడ్‌బుక్ రాజ్యమేలుతోందని ఆరోపించారు. రాష్ట్రం మూడు హత్యలు, ఆరు విధ్వంసాలుగా వర్ధిల్లుతోందని ఎద్దేవా చేశారు. సాక్షాత్తూ గవర్నర్‌తో అసెంబ్లీలో అనేక అవాస్తవాలను చెప్పించారని మండిపడ్డారు. రెండున్నర నెలల్లోనే ఇంత దగా చేస్తారా? అన్ని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ఇకనైనా రాష్ట్రంలో హత్యలు, విధ్వంసాలు ఆపేసి… సూపర్ సిక్స్ హామీలను తు.చ. తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
.@ncbn … ఎన్నికలప్పుడు ఈ రాష్ట్రం బాధ్యత నాది అన్నారు. పైపెచ్చు రాష్ట్రానికి రూ.14లక్షల కోట్ల అప్పులున్నాయని, అయినా సంపద సృష్టిస్తానని, హామీలకు గ్యారెంటీ నాదే అని పదేపదే చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్రం బాధ్యత ప్రజలదంటూ నైజాన్ని బయటపెట్టారు. ఇచ్చిన హామీలనుంచి…
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 10, 2024
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..