AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ratha Saptami: ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి

పవిత్రమైన మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథ సప్తమి లేదా మాఘ సప్తమి అని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున శ్రీ సూర్యదేవుడు జ‌న్మించాడ‌ని, ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్రసాదించాడ‌ని వేదాల ద్వారా తెలుస్తోంది. జనవరి 25న తిరుమ‌లలో రథసప్తమి జరుగనుంది. ఈ పర్వదినం రోజు ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

Ratha Saptami: ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
Tirumala
Raju M P R
| Edited By: |

Updated on: Jan 18, 2026 | 4:18 PM

Share

సూర్య జయంతి సందర్భంగా జనవరి 25న తిరుమ‌లలో రథసప్తమి జరుగనుంది. ఈ పర్వదినం రోజు ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. పవిత్రమైన మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథ సప్తమి లేదా మాఘ సప్తమి అని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున శ్రీ సూర్యదేవుడు జ‌న్మించాడ‌ని, ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్రసాదించాడ‌ని వేదాల ద్వారా తెలుస్తోంది. రథ‌సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని భారీ సంఖ్యలో తిరుమ‌ల‌కు వచ్చే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. ర‌థ‌సప్తమిని మినీ బ్రహ్మోత్సవాలు అని కూడా అంటారు.

వాహన సేవల వివరాలు ఇవే..

తెల్లవారుజామున‌ 5.30 నుంచి 8 గంటల వరకు సూర్యోద‌యం.. ఉద‌యం 6.45 గంట‌ల‌కు– సూర్యప్రభ వాహనం. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం. ఉదయం 11 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనం. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం.

ఆర్జిత సేవలు రద్దు..

రథసప్తమి కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. కాగా, సుప్రబాతం, తోమాల, అర్చన ఏకాంతంలో అర్చకులు నిర్వహిస్తారు.

Follow Us
ఆయుష్ మాత్రే రిటైర్డ్ అవుట్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
ఆయుష్ మాత్రే రిటైర్డ్ అవుట్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
దరిద్రానికి దారితీసే అలవాట్లు ఇవే.. జాగ్రత్తగా ఉండమంటున్న..
దరిద్రానికి దారితీసే అలవాట్లు ఇవే.. జాగ్రత్తగా ఉండమంటున్న..
వాట్సప్‌ ద్వారా సెకన్లలోనే ఇంటర్ ఫలితాలు.. ప్రభుత్వం కొత్త సేవలు
వాట్సప్‌ ద్వారా సెకన్లలోనే ఇంటర్ ఫలితాలు.. ప్రభుత్వం కొత్త సేవలు
భీమవరం స్టైల్ చికెన్ మజ్జిగ పులుసు.. కమ్మని టేస్ట్‌ పక్కా
భీమవరం స్టైల్ చికెన్ మజ్జిగ పులుసు.. కమ్మని టేస్ట్‌ పక్కా
బంగారాన్ని బీభత్సంగా కొన్న ఆ రెండు దేశాలు!
బంగారాన్ని బీభత్సంగా కొన్న ఆ రెండు దేశాలు!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
అట్టడుగు స్థానం నుంచి పైకి లేచిన చెన్నై.. టాప్‌లో ఆర్ఆర్ హవా
అట్టడుగు స్థానం నుంచి పైకి లేచిన చెన్నై.. టాప్‌లో ఆర్ఆర్ హవా
త్వరలో మరో వందే భారత్ స్లీపర్.. రూట్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ
త్వరలో మరో వందే భారత్ స్లీపర్.. రూట్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా..? ఒక్క మ్యాచ్ ఆడితే..
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా..? ఒక్క మ్యాచ్ ఆడితే..
మీ భూమి మీదేనని నిరూపించుకోవాలంటే ఈ మూడు తప్పనిసరి..
మీ భూమి మీదేనని నిరూపించుకోవాలంటే ఈ మూడు తప్పనిసరి..