YS Jagan Exclusive Interview with Rajinikanth TV9 Live: అతను అడుగులు పేదల అభ్యున్నతి వైపు. ఆయన ఆలోచనలు సంక్షేమాభివృద్ధి వైపు. ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్ చేతిలో పెడుతున్న పెద్దకొడుకు. పేదరికంపై యుద్ధానికి చదువనే ఆయుధాన్నిస్తున్న నాయకుడు. నవరత్నాలతో కష్టాలు, కన్నీళ్లు తుడుస్తున్న పేదింటి పెద్దన్న. అక్కాచెల్లి-అవ్వాతాత అంటూ నోరారా పిలిచే ఏకైక ముఖ్యమంత్రి. బీసీలను బ్యాక్‌బోన్ క్లాస్‌గా మారుస్తూ.. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న జననేత. సంక్షేమంతోనూ అభివృద్ధి సాధించొచ్చని నిరూపిస్తున్న టార్చ్ బేరర్. మరణించినా.. ప్రజల గుండెల్లో బతికి ఉండాలన్నదే ఆయన కల. పేదలకు మంచి చేసే విషయంలో ఎవ్వరి మాట విననంటారు. విశ్వసనీయత అనే బ్రాండ్‌నేమ్‌తో మరోసారి జనంలోకి వెళ్తున్నారు. ప్రత్యర్ధులంతా ఏకమైనా ఎన్నికల యుద్ధంలో గెలిచేది తానేనంటూ ధీమాగా చెబుతున్నారు. మరికాసేపట్లో జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ప్రత్యేక ఇంటర్వ్యూ మీ కోసం..
ఇక ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తం 27 సార్లు తలపడ్డాయి. ఈ 27 మ్యాచ్‌ల్లో కేకేఆర్‌దే ఆధిపత్యం. కోల్‌కతా మొత్తం 18 సార్లు గెలిచింది. కాగా హైదరాబాద్ 9 మ్యాచ్‌ల్లో కేకేఆర్‌ను ఓడించగలిగింది. KKR గత 8 మ్యాచ్‌లలో 6 గెలవడం గమనార్హం.
ఇక ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తం 27 సార్లు తలపడ్డాయి. ఈ 27 మ్యాచ్‌ల్లో కేకేఆర్‌దే ఆధిపత్యం. కోల్‌కతా మొత్తం 18 సార్లు గెలిచింది. కాగా హైదరాబాద్ 9 మ్యాచ్‌ల్లో కేకేఆర్‌ను ఓడించగలిగింది. KKR గత 8 మ్యాచ్‌లలో 6 గెలవడం గమనార్హం.
అభిషేక్ శర్మ కూడా 7వ ఓవర్లో యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు. 19 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. రవి బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. 9 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 157 పరుగులు చేసింది.
తన సోదరి సునీత చేస్తున్న ప్రచారం ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపదని జగన్ విస్పష్టంగా చెప్పారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి చెప్తున్న మాటలను ప్రజలు నమ్ముతున్నారని జగన్ తెలిపారు. కడప ప్రజలకు అవినాష్ రెడ్డి ఎలాంటి వాడో తెలుసని అన్నారు.
బాబాయ్ హత్యా కేసును ఒక రాజకీయ అంశంగా మార్చి, రాజకీయంగా ఒక వ్యాక్యూమ్ సృష్టించే ప్రయత్నం చేశారని జగన్ అన్నారు. కేసును తప్పుదారి పట్టిస్తూ వాళ్లే కోర్టును ఆశ్రయించారని వివరించారు. ఈ ఎన్నికను కడప సెంట్రిక్‌గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడమే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండా అని అన్నారు సీఎం జగన్. హోదాను అమ్మేసి చంద్రబాబు ప్యాకేజీ అన్నారు. చంద్రబాబు కారణంగా రాష్ట్రం నష్టపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేసిందన్నారు.
రాష్ట్ర ప్రజలను మోసం చేయడం నాకు ఇష్టం లేదని జగన్ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని, అలాగే ప్రజలు కూడా అభివృద్ధి కావడమే ఇష్టమన్నారు. రాష్ట్రం శ్రీలంక అవుతుందని మాట్లాడుతున్నారని, సూపర్-6, సూపర్ -7 అంటూ అడ్డగోలు హామీలు ఇస్తున్నారని అన్నారు.
చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం గుర్తొస్తుందా..? 14 ఏళ్లుగా చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారని సీఎం జగన్ అన్నారు. గతంలో ఎక్కువ కాన్ఫిడెన్స్‌తో ఉన్నా.. 90 శాతం కుటుంబాల అభివృద్ధిలో జగన్ పాత్ర ఉందన్నారు. చేయగలిగేవి మేనిఫెస్టోలో పెట్టాలి అని అన్నారు. ఇష్టానుసారం హామీలు ఇస్తే నిధులు ఎలా వస్తాయన్నారు. చంద్రబాబు సీఎంగా చేసిన సమయంలో ఒక్క మంచి పనైనా చేసింది ఉందా అని అన్నారు.
పిల్లల చదువులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని, పిల్లల బతుకులు మారాలంటే నాణ్యమైన విద్య అవసరమన్నారు సీఎం జగన్. నాణ్యమైన విద్యతో పిల్లల టాలెంట్ మెరుగవుతుందన్నారు. అందుకే అమ్మ ఒడి ఇస్తున్నామని అన్నారు. పిల్లలకు పెట్టే ప్రతి రూపాయి వారి అభివృద్ధి కోసమేనని అన్నారు.
ఈ ఎన్నికల తర్వాత తాను విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని సీఎం జగన్ అన్నారు. ఇక నుంచి విశాఖ నుంచే పాలన కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ అతిపెద్ద సిటీ అని, విశాఖలో ఉన్న మౌలిక సదుపాయాలు ఏపీలో మరెక్కడా లేవన్నారు.
రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరుగుతున్నా పచ్చకామెర్లు ఉంటే లోకమంతా పచ్చగానే కనిపించినట్లు ఉంటుందని సీఎం జగన్ అన్నారు. ఎంత అభివృద్ధి జరుగుతున్నా వారికి కనిపించదని అన్నారు.
రాష్ట్రంలో గతంలో ఎప్పుడు జరగని అభివృద్ధిని చేశామని జగన్ అన్నారు. మా పాలనలో లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. పారిశ్రామిర వేత్తలు సైతం క్యూ కడుతున్నారని అన్నారు. మూడు వేల లైబ్రరీలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. నేను చేసిన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తోందన్నారు. చూడాలని లేనప్పుడు అభివృద్ధి కనిపించదన్నారు.
తమ ప్రభుత్వం రాష్ట్రం అభివృద్ధే దిశగా అడుగులు వేస్తోందని, రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడుతున్నామని సీఎం జగన్ అన్నారు. అంతేకాకుండా కొత్తగా నాలుగు సి పోర్టులు కడుతున్నామని, అలాగే 10 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాం.. మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో నెంబర్‌గా ఉన్నామన్నారు.
చంద్రబాబు ఒక మోసపూరిత మనిషి అని సీఎం జగన్ ఆరోపించారు. చంద్రబాబుపైనే ఎన్నికల కమిషన్ కేసు పెట్టిందని గుర్తు చేశారు. మోడీ, అమిత్‌షా ముందు చంద్రబాబు మాట్లాడాలని అన్నారు. దేశం మొత్తం ఏపీ మోడల్‌ను ఫాలో అవుతుందన్నారు. తమ ప్రభుత్వం మనసుపెట్టి పాలన చేస్తున్నామని అన్నారు.
రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక గ్రామ పంచాయతీ వ్యవస్థను మార్చామని సీఎం జగన్ అన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న భూరికార్డులన్ని కూడా పంచాయతీలో ఉంచామని, ఎక్కడికో వెళ్లకుండా గ్రామ పంచాయతీలోనే చెక్ చేసుకునే సదుపాయం కల్పించామన్నారు. రైతుల భూములకు సంబంధించి హక్కులు వారికే కల్పించేలా చర్యలు తీసుకున్నామన్నారు.
ల్యాండ్ టైటిలింగ్‌పై చంద్రబాబు వివాదం సృష్టిస్తు్న్నారని, ల్యాండ్ టైటిలింగ్ అంటే ప్రజల భూములపై వారికి హక్కులు కల్పించడమేనని అన్నారు. ప్రతి హామీకి పరిష్కారాలు వెతుకుతూ అమల్లోకి తెచ్చామన్నారు. 99 శాతం హామీలు నెరవేర్చి మేనిఫెస్టోకు పవిత్రత తెచ్చామన్నారు. తాము ల్యాండ్ టైటిలింగ్ తీసుకువచ్చిన తర్వాత వారి భూములు ఎవరికైనా అమ్మవచ్చు.. క్రయ విక్రయాలు చేయవచ్చన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని, లంచం ఇస్తే గానీ పని జరగని పరిస్థితి ఎదురైందని, అలాగే విద్యా కూడా సరిగ్గా లేని పరిస్థితి ఉందని, అందుకే పాలనలో ప్రక్షాళన చేశానని సీఎం జగన్ అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఒక వ్యస్థను తీసుకువచ్చామని, అన్ని అంశాలను ప్రక్షళాన చేశామని అన్నారు. తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజల కోసం వ్యస్థను మార్చడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.
గత ఎన్నికలకు ముందు తాను చేసిన పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్నానని, తాను కళ్లారా చూశానని, అందుకే తనను ప్రజలు ఆదరించారని, ఆ తర్వాతే అధికారంలోకి వచ్చామని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు పంచుకున్నారు.