హోర్డింగ్ పైకి ఎక్కిన యువకుడు.. వైజాగ్ బీచ్ రోడ్డులో హల్చల్..

| Edited By: Srikar T

Jun 07, 2024 | 9:39 AM

విశాఖలో ఓ యువకుడు బీచ్ రోడ్ హార్డింగ్ పైకిఎక్కాడు. తన దగ్గరకు ఎవరైనా రావాలని చూస్తే దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. చేతిలో కత్తి పట్టుకుని హల్చల్ చేశాడు. దీంతో అతగాడిని కిందకు దింపేందుకు పోలీసుల తలప్రాణం తోకకు వచ్చింది. ఇంతకు ఆ కుర్రాడు ఎందుకు ఆ హోర్డింగ్ పైకి ఎక్కాడో తెలుసా..? పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రశేఖర్ అనే యువకుడు ఐటిఐ చదివాడు. తన కాలేజీలో సూపర్ జూనియర్‎గా ఉన్న యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ ఇష్టపడి ప్రేమించుకున్నారు. రెండు నెలల క్రితం సింహాచలంలో పెళ్లికూడా చేసుకున్నాడు.

హోర్డింగ్ పైకి ఎక్కిన యువకుడు.. వైజాగ్ బీచ్ రోడ్డులో హల్చల్..
Visakhapatnam
Follow us on

విశాఖలో ఓ యువకుడు బీచ్ రోడ్ హార్డింగ్ పైకిఎక్కాడు. తన దగ్గరకు ఎవరైనా రావాలని చూస్తే దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. చేతిలో కత్తి పట్టుకుని హల్చల్ చేశాడు. దీంతో అతగాడిని కిందకు దింపేందుకు పోలీసుల తలప్రాణం తోకకు వచ్చింది. ఇంతకు ఆ కుర్రాడు ఎందుకు ఆ హోర్డింగ్ పైకి ఎక్కాడో తెలుసా..? పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రశేఖర్ అనే యువకుడు ఐటిఐ చదివాడు. తన కాలేజీలో సూపర్ జూనియర్‎గా ఉన్న యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ ఇష్టపడి ప్రేమించుకున్నారు. రెండు నెలల క్రితం సింహాచలంలో పెళ్లికూడా చేసుకున్నాడు. ఇద్దరూ ఇంటికి దూరంగా ఉన్నారు. యువతి తండ్రి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ పెట్టాడు.

ఆ తర్వాత క్రమంలో యువతి అనారోగ్యం పాలయింది. ఈవిషయం తల్లిదండ్రులకు తెలియడంతో.. ఆమెను పుట్టింటికి తీసుకెళ్లిపోయారు. అక్కడ నుంచి తమ స్వగ్రామానికి వెళ్లిపోయారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య సహా.. ఆమె తల్లిదండ్రులు కూడా తన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం లేదని తెలిపాడు. ఎంతకూ స్పందించకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు చంద్రశేఖర్. ఇక బీచ్ రోడ్‎లోని హోల్డింగ్ పైకి ఎక్కేసాడు. చేతిలో కత్తి పట్టుకొని బెదిరించాడు. ఎవరైనా తనను రక్షించాలని ప్రయత్నిస్తే.. కత్తితో గొంతు కోసుకొని దూకేస్తానని హల్ చల్ చేశాడు. పోలీసులు, ఫైర్ సిబ్బంది వచ్చారు. ఎంత నచ్చచెప్పినా వినలేదు. చివరకు కౌన్సిలింగ్ చేసి నాలుగు గంటలపాడు శ్రమించి ఎలాగోలా కిందకు దింపారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..