AP News: ‘మద్యం మత్తులో మంచింగ్‌కు గాజు పెంకులు..’ కానీ అసలు ట్విస్ట్ వేరే ఉంది..

| Edited By: Ravi Kiran

Feb 02, 2024 | 6:45 PM

అనంతపురం జిల్లా గుత్తిలో మద్యం మత్తులో గాజు పెంకులు మింగి యువకుడి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానిక బాచుపల్లి గ్రామ జాతరలో ఆదినారాయణ అనే వ్యక్తి మద్యం మత్తులో గాజు పెంకులు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.

AP News: మద్యం మత్తులో మంచింగ్‌కు గాజు పెంకులు.. కానీ అసలు ట్విస్ట్ వేరే ఉంది..
Representative Image
Follow us on

అనంతపురం జిల్లా గుత్తిలో మద్యం మత్తులో గాజు పెంకులు మింగి యువకుడి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానిక బాచుపల్లి గ్రామ జాతరలో ఆదినారాయణ అనే వ్యక్తి మద్యం మత్తులో గాజు పెంకులు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. గుత్తి పట్టణం చెర్లోపల్లి కాలనీకి చెందిన భవన నిర్మాణ కార్మికుడు ఆదినారాయణ గుత్తి మండలం బాచుపల్లి గ్రామంలో జాతరకు వెళ్లాడు. ఈ క్రమంలో బంధువులతో ఆదినారాయణకు చిన్న విషయానికి పెద్ద గొడవ జరిగింది. దీంతో మనస్థాపం చెందిన ఆదినారాయణ అప్పటికే మద్యం మత్తులో ఉండడంతో.. పక్కనే ఉన్న బీరు సీసాను పగలగొట్టి గాజు పెంకులు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

గాజు పెంకులు మింగడంతో నోటి నుంచి నురగ కక్కుతూ.. అపస్మారక స్థితిలో ఉన్న ఆదినారాయణను గమనించిన బంధువులు గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆదినారాయణ పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో.. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై బాధిత బంధువులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మద్యం మత్తులో మంచింగ్ అనుకున్నాడో.. ఏమో గాజు పెంకులు మింగాడు అనుకుంటున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు.