Andhra Pradesh: ఇన్ స్టాగ్రామ్ పరిచయంతో మైనర్ పై అత్యాచారం.. మద్యం తాగించి దారుణం
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా మార్పు రావడం లేదు. విచ్చలవిడిగా పెరిగిపోయిన....
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా మార్పు రావడం లేదు. విచ్చలవిడిగా పెరిగిపోయిన సోషల్ మీడియా వినియోగం ద్వారా నేరాలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో జరిగింది. రేపల్లె, గురజాల అత్యాచార ఘటనలు మరవకముందే తాజాగా గుంటూరు(Guntur) లో ఇలాంటి ఘటనే జరిగింది. ఇన్ స్టా ద్వారా పరిచయం ఏర్పరుచుకున్న ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మద్యం తాగించి మరీ దారణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. గుంటూరు నగరంలోని శివారు ప్రంతానికి చెందిన బాలికకు తాడికొండ మండలం గరికపాడు గ్రామానికి చెందిన డి.గ్రేస్‌బాబు అనే యువకుడితో ఇన్ స్టా గ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. గ్రేస్‌బాబు తన స్నేహితులైన రిక్కీ, మణికంఠలను ఆ బాలికకు పరిచయం చేశాడు. వీరు బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. నగర శివారులోని ఇన్నర్ రింగ్‌రోడ్‌లో ఓ హోటల్‌లో గది తీసుకుని మద్యం తాగారు.
మద్యం మత్తులో బాలికకు ఫోన్ చేసి, గ్రేస్‌బాబు మద్యం తాగి హోటల్‌లో పడిపోయాడని, మీరొస్తేనే అన్నం తింటానంటున్నాడని నమ్మించారు. ఇంట్లో బాలిక తల్లిదండ్రులు లేకపోవటంతో బలవంతంగా బైక్ ఎక్కించుకుని హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ బాలికకు మద్యం తాగించారు. ఆమె మత్తులోకి వెళ్లగానే రిక్కీ, మణికంఠలు అత్యాచారానికి పాల్పడ్డారు. తల్లిదండ్రులు పనులు చేసుకుని రాత్రికి ఇంటికి వెళ్లే సరికి బాలిక ఇంట్లో లేదు. చుట్టుపక్కలా వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మరోవైపు అత్యాచారం అనంతరం బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లటంతో ఆ యువకులు ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చి ఇంటి సమీపంలో వదిలేశారు. వెంటనే బాధితురాలి తల్లి నల్లపాడు స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను జీజీహెచ్‌కు తరలించారు.
మరో బృందం హోటల్‌కు వెళ్లి సీసీ కెమెరా ఫుటేజీ సేకరించి నిందితులను అదుపులోకి తీసుకుంది. నల్లపాడు పోలీసు స్టేషన్‌కు అరకిలోమీటరు దూరంలోనే ఈ దారుణం జరిగింది. బుధవారం రాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన జరగగా పోలీసులు మాత్రం గురువారం సాయంత్రం కేసు నమోదు చేయటం విమర్శలకు దారితీసింది. గ్రేస్‌బాబుపై కేసు నమోదు కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అతడు నేరానికి పాల్పడలేదని నల్లపాడు సీఐ బి.శ్రీనివాసరావు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
Chandrababu: చంద్రబాబు సంచలన ప్రకటన.. రానున్న ఎన్నికల తొలి అభ్యర్థి పేరు బహిరంగంగా ప్రకటన