అయ్యో.. ఎంత పని జరిగింది.. మరికాసేపట్లో హైదరాబాద్ బస్సు ఎక్కాల్సినోడు..!

పని నిమిత్తం మరికాసేపట్లో హైదరాబాద్ బస్సు ఎక్కాల్సిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో జరిగిన గొడవలో.. అనంతపురం బస్టాండ్ సమీపంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. హఠాత్తు పరిణామంతో షాకైన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అయ్యో.. ఎంత పని జరిగింది.. మరికాసేపట్లో హైదరాబాద్ బస్సు ఎక్కాల్సినోడు..!
Young Man Brutally Murdered

Edited By:

Updated on: Mar 23, 2026 | 10:28 AM

పని నిమిత్తం మరికాసేపట్లో హైదరాబాద్ బస్సు ఎక్కాల్సిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో జరిగిన గొడవలో.. అనంతపురం బస్టాండ్ సమీపంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. హఠాత్తు పరిణామంతో షాకైన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఆత్మకూరు మండలం మదిగుబ్బ గ్రామానికి చెందిన ఆదర్శ్ (25) పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లేందుకు మిత్రులతో కలిసి అనంతపురం బస్టాండ్ కి వచ్చాడు. తెల్లవారుజామున అల్పాహారం కోసం బస్టాండ్ సమీపంలోని హోటల్ కు మిత్రులతో కలిసి ఆదర్శ్ వెళ్లాడు. టిఫిన్ చేసి బస్సు ఎక్కేందుకు హోటల్ నుంచి బయటకు వచ్చాడు. ఈ సమయంలో ద్విచక్ర వాహనం పక్కకు తీసే విషయంలో మద్యం మత్తులో ఉన్న బన్నీ, కరుణాకర్ తో యువకుడు ఆదర్శ్ కు మధ్య గొడవ చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న బన్నీ, కరుణాకర్. పగిలిన పదునైన టైల్స్ రాయితో ఆదర్శ్ ఛాతిపై బలంగా పొడిచారు.

తీవ్ర గాయాలతో కుప్పకూలి కింద పడిపోయిన ఆదర్శ్‌ను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు ఆదర్శ్ మృతి చెందాడు. గొడవపడిన ఇద్దరు యువకులు అక్కడి నుంచి పరార్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అనంతపురం త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. మరి కాసేపట్లో హైదరాబాద్ బస్సు ఎక్కుతాడు అనగా.. మద్యం మత్తులో జరిగిన గొడవ.. యువకుడు హత్యకు దారి తీసింది..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us