AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP &TG ICET 2026 Registration: తెలుగు రాష్ట్రాల్లో ఐసెట్‌ 2026 దరఖాస్తుకు మరికొన్ని గంటలే అవకాశం.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!

ఏపీ, తెలంగాణలో 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్‌ 2026 నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఎలాంటి ఆలస్య రుసుములేకుండా ఐసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవడానికి మరికొన్ని గంటలే అవకాశం ఉంది. మార్చి 23వ తేదీ రాత్రి 11.59 గంటలకు..

AP &TG ICET 2026 Registration: తెలుగు రాష్ట్రాల్లో ఐసెట్‌ 2026 దరఖాస్తుకు మరికొన్ని గంటలే అవకాశం.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ICET Registration deadline
Srilakshmi C
|

Updated on: Mar 23, 2026 | 10:17 AM

Share

అమరావతి, మార్చి 23: రెండు తెలుగు రాష్ట్రాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్‌ 2026 నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఎలాంటి ఆలస్య రుసుములేకుండా ఐసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవడానికి మరికొన్ని గంటలే అవకాశం ఉంది. మార్చి 23వ తేదీ రాత్రి 11.59 గంటలకు దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఆంధ్రప్రదేశ్‌ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఐసెట్‌ 2026)కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాది ఐసెట్‌ పరీక్షను ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించనుంది. ఏపీ ఐసెట్‌ 2026 పరీక్షలను మే 2న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు.

ఏపీ ఐసెట్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ముఖ్యమైన తేదీలు..

  • రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 25, 2026.
  • రూ.4000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 30, 2026.
  • రూ.10,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 3, 2026.
  • కరెక్షన్‌ విండో: ఏప్రిల్ 5, 2026.
  • హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభం: ఏప్రిల్ 15, 2026.
  • ఏపీ ఐసెట్‌ 2026 పరీక్ష తేదీ: మే 2, 2026.
  • ప్రిలిమినరీ కీ విడుదల తేదీ: మే 5, 2026 సాయంత్రం 5 గంటలకు.
  • ఫలితాలు విడుదల తేదీ: మే 16, 2026.

ఏపీ ఐసెట్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఐసెట్‌ 2026కు దరఖాస్తు గడువు ఇదే..

తెలంగాణ ఐసెట్‌ 2026కు సైతం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుములేకుండా మార్చి 23 (సోమవారం)వ తేదీ తుది గడువు సమయం ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ ఐసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు మే 13, 14 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో జరగనున్నాయి. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ముగింపు గడువులోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

తెలంగాణ ఐసెట్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ముఖ్యమైన తేదీలు..

  • రూ.250 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 30, 2026.
  • రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 7, 2026.
  • రూ.5,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: మే 1, 2026.
  • రూ.10,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: మే 2, 3 తేదీల్లో 2026.
  • కరెక్షన్‌ విండో: ఏప్రిల్ 5, 2026.
  • హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభం: ఏప్రిల్ 15, 2026.
  • ఏపీ ఐసెట్‌ 2026 పరీక్ష తేదీ: మే 2, 2026.
  • ప్రిలిమినరీ కీ విడుదల తేదీ: మే 5, 2026 సాయంత్రం 5 గంటలకు.
  • ఫలితాలు విడుదల తేదీ: మే 16, 2026.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us