Online Games: ఆన్‌లైన్ గేమ్ ఆడి రూ.78 వేలు పోగొట్టుకున్నాడు.. చివరికి

|

Jun 06, 2023 | 10:56 AM

స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగినప్పటి నుంచి ఆన్‌లైన్ గేములు కూడా ఆడటం విపరీతంగా పెరిగింది. చాలామంది డబ్బులు పెట్టి గేమ్‌లు ఆడుతూ పొగొట్టుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. తాజాగా మరో ఘటన ఏపీలోని కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది.

Online Games: ఆన్‌లైన్ గేమ్ ఆడి రూ.78 వేలు పోగొట్టుకున్నాడు.. చివరికి
Online Game In Mobile
Follow us on

స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగినప్పటి నుంచి ఆన్‌లైన్ గేములు కూడా ఆడటం విపరీతంగా పెరిగింది. చాలామంది డబ్బులు పెట్టి గేమ్‌లు ఆడుతూ పొగొట్టుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. తాజాగా మరో ఘటన ఏపీలోని కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే సాత్విక్ అనే యువకుడు ఫోన్లో ఆన్‌లైన్ ఆడాడు. అలా ఆడుతూనే సుమారు రూ.78 వేలు పొగొట్టుకున్నాడు.

మరో విషయం ఏంటంటే సాత్విక్ మేనత్త దుబాయ్‌లో పనిచేస్తోంది. అక్కడే పనిచేస్తు ఇంటికి డబ్బులు పంపేది. అయితే ఈసారి సాత్విక్ తాత ఆపరేషన్ కోసమని రూ.78 వేలు ఫోన్‌కు పంపింది. కానీ సాత్విక్ గేమ్ ఆడి డబ్బులు పోగొట్టాడు. దీంతో అతను ఇంట్లో తెలిస్తే కొడతారని భయాందోళనకు గురయ్యాడు. ఇక చేసేదేమి లేక ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం