Rain Alert: తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే..

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు ఐఎండీ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని స్పష్టం చేసింది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే..
Rains

Updated on: Aug 06, 2026 | 4:53 PM

ఏపీ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే మూడ్రోజుల్లో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ఉత్తర ఒడిశా, దానిని ఆనుకుని ఉన్న గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం, ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. అలాగే నిన్నటి ఆగ్నేయ బంగాళాఖాత ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4 .5 నుండి 5 .8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతున్నది. ఇక ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ, వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను అమరావతి వాతావరణశాఖ జారీ చేసింది. వాటి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మూడ్రోజుల పాటు వర్షాలు

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో రాబోయే మూడ్రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఇక ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఇఖ దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమలో ఈరోజు ,రేపు, ఎల్లుండి
తేలికపాటి నుండి మోస్తరు వర్షాలకు అవకాశముందని  అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వర్షాల సమయంలో బలమై న గాలులు వీచే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్ సహా 10 జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణశాఖ సూచించింది. హైదరాబాద్‌లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది., కుమురం భీమ్, మేడక్, ములుగు, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్, మహబూబ్‌నగర్‌, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో తేలికపాటి వర్షాలకు కురుస్తాయని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి ప్రస్తుతం ఫిరోజ్‌పూర్, రోహ్‌టక్, షాజహాన్‌పూర్, కాన్పూర్, డాల్టన్‌గంజ్, దిగ్ఘా మీదుగా కొనసాగుతూ, అక్కడి నుంచి తూర్పు-ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు విస్తరించి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం మీద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us