AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో ఒంటరిగా ఉన్న అత్త.. లవర్‌తో కలిసి ఎంట్రీ ఇచ్చిన అల్లుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో బంగారు నగల కోసం అత్తను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. జల్సాలకు అలవాటు పడిన చిన్నల్లుడు తన ప్రియురాలితో కలిసి ఇంట్లో ఒంటరిగా ఉన్న అత్తపై దాడి చేసి దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఇంట్లో ఒంటరిగా ఉన్న అత్త.. లవర్‌తో కలిసి ఎంట్రీ ఇచ్చిన అల్లుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Prakasam Crime News
Fairoz Baig
| Edited By: |

Updated on: Aug 26, 2026 | 8:14 PM

Share

జల్సాలకు అలవాటు పడ్డ ఓ అల్లుడు బంగారు నగల కోసం అత్తను హత్య చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తన ప్రియురాలితో కలిసి అత్తపై దాడి చేసి దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలతో ఉడాయించారు. చేసిన పాపం ఊరికేపోదు అన్నట్టుగా.. పోలీసుల విచారణలో అసలు నిజం బయటకు వచ్చింది.. అల్లుడే హంతకుడిగా గుర్తించిన పోలీసులు నిందితులను పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. వివరాల ప్రకారం.. ప్రకాశంజిల్లా చీమకుర్తికి మండలం గంగవరం రోడ్డులో నివాసం ఉంటుర్న షేక్‌ మీరాబీ ఈనెల 21వ తేదిన సాయంత్ర ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె చిన్నల్లుడు షేక్‌ మస్తాన్‌వలి, అతని ప్రియురాలు ఇంట్లోకి చొరబడ్డారు. మీరాబీ భర్త ఇంట్లో లేని సమయాన్ని ఆసరాగా చేసుకున్న ఇద్దరు నిందితులు మీరాబీపై దాడికి పాల్పడ్డారు. అనంతరం దిండును ముఖంపై బలంగా అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.

ఆ తర్వాత.. ఆమె చెవులకు ఉన్న రెండు బంగారు కమ్మలు, ఒక బంగారు గొలుసును దోచుకుని పరారయ్యారు. మీరాబీ భర్త షేక్ మీరావలి ఇచ్చిన ఫిర్యాదుతో చీమకుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అనుమానితుల కదలికలపై నిఘా పెట్టారు.

అల్లుడే హంతకుడు..

పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలి చిన్న అల్లుడు షేక్ మస్తాన్ వలి, అతనితో వివాహేతర సంబంధం నడుపుతున్న కుమారి అనే మహిళ కలిసి ఈ హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇద్దరూ జల్సాలకు అలవాటుపడి డబ్బుల కోసం మీరాబీ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలపై కన్నేసినట్లు పోలీసులు తెలిపారు. ఆభరణాలను తాకట్టు పెట్టేందుకు ఇవ్వాలని అత్త మీరాబీని అల్లుడు మస్తాన్‌వలి అడగడంతో ఆమె నిరాకరించిందన్న కోపంతో ఆమెను హత్య చేసి అనంతరం బంగారు నగలు ఎత్తుకెళ్ళినట్టు పోలీసులు నిర్ధారించారు. చిన్నల్లుడు మస్తాన్‌వలిపై నిఘా పెట్టిన పోలీసులు దోచుకున్న బంగారు ఆభరణాలను విక్రయించేందుకు వెళ్తుండగా ఎర్రగుడిపాడు అడ్డరోడ్డు దగ్గర నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అరెస్టు చేసి.. మీరాబీకి చెందిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అత్త బంగారంపై కన్నేసిన అల్లుడు.. ఒంటరిగా ఇంట్లో ఉండగా..
అత్త బంగారంపై కన్నేసిన అల్లుడు.. ఒంటరిగా ఇంట్లో ఉండగా..
ఆస్ట్రేలియాలో కాబట్టే మూసుకున్నారు.. అదే భారత్‌లో జరిగితే
ఆస్ట్రేలియాలో కాబట్టే మూసుకున్నారు.. అదే భారత్‌లో జరిగితే
తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. పోటీలు నిర్వహించే నగరాలు ఇవే
తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. పోటీలు నిర్వహించే నగరాలు ఇవే
ఓటీటీలో సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలో సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ట్రంప్‌ వర్సెస్‌ ఓటు.. అమెరికా ఎన్నికల్లో అసలు ఫైట్‌ ఇదే..
ట్రంప్‌ వర్సెస్‌ ఓటు.. అమెరికా ఎన్నికల్లో అసలు ఫైట్‌ ఇదే..
54 బంతుల్లో మ్యాచ్ క్లోజ్.. 2 బంతుల్లోనే ఛేజింగ్..
54 బంతుల్లో మ్యాచ్ క్లోజ్.. 2 బంతుల్లోనే ఛేజింగ్..
భారత రైల్వే నె‌ట్‌వర్క్ అభివృద్ధిపై కేంద్రం ఫోకస్..
భారత రైల్వే నె‌ట్‌వర్క్ అభివృద్ధిపై కేంద్రం ఫోకస్..
దేశంలో ఉద్యోగ కల్పన, నిరుద్యోగంపై ఫ్యాక్ట్ చెక్‌లో కీలక విషయాలు
దేశంలో ఉద్యోగ కల్పన, నిరుద్యోగంపై ఫ్యాక్ట్ చెక్‌లో కీలక విషయాలు
చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహారాలు ముట్టొద్దు..
చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహారాలు ముట్టొద్దు..
మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం
మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం