Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YSRCP: ఎన్నికల వేళ సరికొత్త నినాదంతో ప్రజల్లోకి వైసీపీ.. హోర్డింగులు,  స్లొగన్స్ తో జగన్ జోరు

ఏపిలో ఎన్నికల కోసం వైసీపీ మరో క్యాంపెయిన్ ప్రారంభించింది. అన్ని వర్గాలకు దగ్గరయ్యేలా భారీగా ప్రచారాన్ని ముమ్మరం చేసింది వైసీపీ. అందులో భాగంగానే సిద్ధం సభలకు దీటుగా ఏపి వ్యాప్తంగా నా కల పేరుతో జగన్ ఫోటోలతో భారీగా ప్రచారాన్ని విస్తృతం చేయబోతుంది. అధికార వైసీపీ రాష్ట్రంలో ఇప్పటివరకు సిద్ధం క్యాడర్ సమావేశాల పేరుతో ఎన్నికల హీట్ పుట్టించింది.

YSRCP: ఎన్నికల వేళ సరికొత్త నినాదంతో ప్రజల్లోకి వైసీపీ.. హోర్డింగులు,  స్లొగన్స్ తో జగన్ జోరు
Ycp
Follow us
S Haseena

| Edited By: Balu Jajala

Updated on: Mar 05, 2024 | 5:50 PM

ఏపిలో ఎన్నికల కోసం వైసీపీ మరో క్యాంపెయిన్ ప్రారంభించింది. అన్ని వర్గాలకు దగ్గరయ్యేలా భారీగా ప్రచారాన్ని ముమ్మరం చేసింది వైసీపీ. అందులో భాగంగానే సిద్ధం సభలకు దీటుగా ఏపి వ్యాప్తంగా నా కల పేరుతో జగన్ ఫోటోలతో భారీగా ప్రచారాన్ని విస్తృతం చేయబోతుంది. అధికార వైసీపీ రాష్ట్రంలో ఇప్పటివరకు సిద్ధం క్యాడర్ సమావేశాల పేరుతో ఎన్నికల హీట్ పుట్టించింది. ఉత్తరాంధ్రలో భీమిలి ఏలూరు, అనంతపురం వేదికగా జరిగిన సభలకు లక్షలాదిగా కార్యకర్తలు హాజరైయ్యారని వైసీపీ అంటోంది.అయితే సిద్ధం సభల సిరీస్లో చివరిగా జరగనున్న పల్నాడు జిల్లా సభకు 15 లక్షల మంది కార్యకర్తలు వస్తారని వైసీపీ అంచనా వేస్తోంది .ఓ వైపు సిద్ధం సభలు నిర్వహిస్తూనే ఎన్నికల పోల్ మేనేజ్మెంట్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా బూత్ కమిటీలను నియమించి మరో సరి కొత్త నినాదంతో వైసీపీ ఎన్నికల రణరంగంలోకి దిగుతోంది.

నాకు ఒక కల ఉంది” పేరుతో కొత్త నినాదాన్ని వైసీపీ సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు జగన్ ఫోటోతో సిద్ధం ఫ్లెక్సీలు చూశాం, దానికి సమాధానం చెబుతు సీఎం జగన్ కార్యకర్తల కోసం సిద్ధం సభలు నిర్వహించారు .వచ్చే ఆదివారం అద్దంకిలో జరగనున్న సిద్ధం సభ చివరిది కావడంతో ఇకపై ఎపిలో సిద్ధం పోస్టర్లు కనిపించవు. అందుకు ప్రత్యామ్నాయంగా వైసీపీ మరో నినాదంలో ప్రజల్లోకి వస్తోంది. నాకు ఒక కల ఉంది పేరుతో  రాష్ట్రంలోని ప్రతి నగరం ప్రతి వాడలో కార్మికులతో, పిల్లలతో, అవ్వతాతలతో, అక్కచెల్లమ్మలతో, రైతులతో జగన్ ఉన్న ఫోటోతో మీ కల నా కల అంటూ ప్రత్యక్షం అయ్యాయి. దీంతో ప్రజల కలే తన కలగా చెబుతూ అవి నేరవేర్చే దిశగా అడుగులు వేస్తానంటూ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ మొత్తం మీ కల నా కల ప్రచారంలో మొత్తం 6 వర్గాల ప్రజలకు చెందిన హోర్డింగ్ లు ఉన్మాయి. వైసీపీ ఏర్పాటు చేసిన హార్డింగ్లలో రైతుల కల – జగనన్న కల, యువత కల జగనన్న కల, అక్కా చెల్లెమ్మల కల జగనన్న కల, అవ్వా తాతల కల జగనన్న, కార్మికుల కల జగనన్న కల అంటూ హోర్డింగ్లను వైసీపీ ఏర్పాటు చేసింది.

వైసీపీ తాజా స్లోగన్ భారీ అర్థం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఎన్నికల కోసం పార్టీలు ఇచ్చే హామీలు కేవలం మ్యానిఫెస్టోలో మాత్రమే చూస్తుంటాం కానీ అందుకు భిన్నంగా ఆలోచించిన వైసీపీ ప్రజల్లోకి ముఖ్యంగా ఆయా వర్గాల దగ్గరయ్యే నినాదాలతో ప్రజల్లోకి వెళ్తుంది. సిద్ధం పేరుతో నిర్వహించిన సభలు భారీ హిట్ అవడంతో అదే ఊపుతో ఇప్పుడు బూత్ లెవల్లో ఉండే ప్రతి ఒక్కరికీ తాము వస్తె ఏమి చేస్తాము ఏమి ఇస్తాము అనే అంశాలను ఆయా వర్గాల అభివృద్ధికి దోహద పడేలా భారీగా క్యాంపెయిన్ చేస్తుంది వైసీపీ. ముఖ్య యువత, రైతులు, వృద్ధులు, కార్మికుల కోసమే వైసీపీ అండగా ఉంటుందన్న అర్దం వచ్చేలా క్యాంపెయిన్ చేస్తుంది. ఇప్పుడు జెట్ స్పీడ్ ఎన్నికల కథన రంగంలో దూసుకెళ్తున్న వైసీపీ కొత్త నినాదంతో సరికొత్తగా అడుగులు వేస్తుంది.