Rajahmundary: రాజమండ్రికి ఇక మహర్ధశ.. రాష్ట్రంలోనే ముఖ్య నగరంగా తీర్చిదిద్దుతామన్న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

|

Aug 27, 2021 | 7:31 PM

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ గోదావరి తీర నగరం రాజమండ్రిని రాష్ట్రంలోనే ముఖ్య నగరంగా తీర్చిదిద్దుతామని

Rajahmundary: రాజమండ్రికి ఇక మహర్ధశ.. రాష్ట్రంలోనే ముఖ్య నగరంగా తీర్చిదిద్దుతామన్న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి
Rajahmundary
Follow us on

YV Subba Reddy – Botsa Satyanarayana – Rajahmundary: తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ గోదావరి తీర నగరం రాజమండ్రిని రాష్ట్రంలోనే ముఖ్య నగరంగా తీర్చిదిద్దుతామని టీటీడీ చైర్మన్‌, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. రాజమండ్రి(రాజమహేంద్రవరం)లో మరో 16 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పిన సుబ్బారెడ్డి.. కొందరు కోర్టుకు వెళ్లడం వల్ల ఇళ్ల స్థలాల పంపిణీ ఆగిందని చెప్పారు.

ఇప్పటికే 6 వేల మందికి టిడ్కో ఇళ్లు అందజేశామని గుర్తు చేశారు. పేద ప్రజలకు మేలు చేయడమే సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లక్ష్యమని వైవీ చెప్పుకొచ్చారు. ఇవాళ రాజమండ్రిలో రుడా కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం వైవీ సుబ్బారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

సాంకేతిక సమస్యలపై కోర్టులను ఒప్పిస్తామని.. ఎట్టి పరిస్థితుల్లో పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించడం ఖాయమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. పేద ప్రజలు, రాష్ట్రాభివృద్ధికి జగన్ ప్రభుత్వం తెస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని బొత్స మండిపడ్డారు. “నాకు అడ్రస్‌ ఉంది.. చంద్రబాబు, లోకేష్‌కు ఇళ్లు ఎక్కడున్నాయి” అని ఆయన నిలదీశారు.

ఆస్తి పన్ను విధానంపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్న మంత్రి.. పేద, మధ్య తరగతి వర్గాలపై భారం పడకూడదని సీఎం ఆదేశించారని చెప్పుకొచ్చారు. దళారుల వ్యవస్థను నిరోధించడానికే కొత్త పన్నుల విధానం తీసుకువచ్చామని బొత్స అన్నారు. పన్నుల విధానంపై చంద్రబాబు, లోకేష్‌ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని బొత్స ఎద్దేవా చేశారు.

YV Subba Reddy

Read also: Revanth Reddy: 420 కింద జైల్లో వేయాల్సిన అతడ్ని మంత్రిని చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే: రేవంత్ రెడ్డి