AP Politics: సీఎం జగన్‌ మాటే మా బాట.. ఊహాగానాలకు చెక్ పెట్టిన వైసీపీ ట్రబుల్ షూటర్లు..

వైసీపీలో వారిద్దరు కీలక వ్యక్తులు. ఇన్నాళ్లు వారిమధ్య కోల్డ్‌ వార్‌ జరుగుతున్నట్టు ప్రచారం జరిగింది. తాజాగా ఆ ప్రచారానికి చెక్‌ పెట్టారు ఆ నేతలు. ఇంతకీ ఎవరు వారు?

AP Politics: సీఎం జగన్‌ మాటే మా బాట.. ఊహాగానాలకు చెక్ పెట్టిన వైసీపీ ట్రబుల్ షూటర్లు..
Vijayasai Reddy and Sajjala Ramakrishna Reddy

Edited By:

Updated on: May 07, 2022 | 7:20 AM

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి అధికార వైసీపీలో కీలక నేతలు. జగన్ వైసీపీలో నెంబర్ 1 అయితే, నెంబర్ 2 పొజీషన్ కోసం విజయసాయి, సజ్జల మధ్య పోటీ నెలకొందన్న ప్రచారం ఏపీ రాజకీయాల్లో చాలా రోజులుగానే ఉంది. అటు కొంతకాలంగా పార్టీ వ్యవహారాల్లో సజ్జల మాటకే జగన్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న టాక్ వినిపించింది. దీంతో విజయసాయికి పార్టీలో ప్రాధాన్యత తగ్గిందన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో సజ్జల-విజయసాయి భేటీ కావడం, వైసీపీతో పాటు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నెలకొందన్న ఊహాగానాలకు తెరదించుతూ వారిద్దరూ భేటీ అయ్యారు. ఇన్నాళ్లు జరిగిన ప్రచారానికి పుల్‌స్టాప్ పెట్టారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా, వీరిద్దరు ఏం మాట్లాడుకున్నారది చర్చనీయాంశమైంది. మరో రెండేళ్లలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై, ఈ ఇద్దరు నేతలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. సజ్జల, విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి జగన్‌కు, అటు పరిపాలనలో, ఇటు పార్టీని నడపడంలోను చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ప్రభుత్వంలో ఏ సమస్య వచ్చినా దానికి సంబంధించి జగన్ ఆలోచన తెలుసుకుని ఆ విధంగానే సమస్యను పరిష్కరించడంలో సజ్జల పేరుపొందారు. పార్టీకి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డికి కీలకమైన బాధ్యతలు అప్పగించారు. ఇటీవల వరకు పార్లమెంట్ పార్టీ నేతగా కేంద్రంలో కీలకంగా వ్యవహరించారు విజయసాయిరెడ్డి.

పార్టీని బలోపేతం చేసే దిశగా ఏ చర్యలు తీసుకోవాలనే అంశాలు ఇద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.

ఇవి కూడా చదవండి

ఏపీ వార్తల కోసం..

ఇవి కూడా చదవండి: Chandrababu: మొన్న మంత్రి చెల్లుబోయిన.. ఇవాళ మరో మంత్రి సీదిరి.. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారన్న చంద్రబాబు..

Azam Khan: ఇది ‘న్యాయానికి జరిగిన అవహేళన’.. అజం ఖాన్‌కు మధ్యంతర బెయిల్‌లో జాప్యంపై సుప్రీంకోర్టు సీరియస్..