Vijayasai reddy: టీడీజీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. భోగి పండుగ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు చేసిన కామెంట్స్‌పై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. సెటైర్లు పేల్చారు. పండుగ పూట చంద్రబాబు డ్రామాలాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ”సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయి రెండేళ్లు అవుతుంది. అయినా ఎలా ఓడిపోయాడో ఆయనకు తెలియదంట. సంక్రాంతి సృష్టికర్తనని చెప్పుకునే బాబు గారికి ఆ విషయం తెలియకుండా ఉంటుందా. పైగా సారీ.. పూర్తిగా మారిపోయానంటూ కొత్త డ్రామాలకు తెరలేపారు. ఇలా ఎన్నిసార్లు మారుతారు చంద్రబాబు గారూ? ఓవైపు దేవాలయాలను ధ్వంసం చేస్తూ.. మరోవైపు తన ఓటమికి ప్రజలను నిందిస్తున్నాడు” అని ఘాటైన పదజాలంతో విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. కాగా, పాడి పంటలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోలపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. ఆ జీవో ప్రతులను భోగి మంటల్లో వేసి కాల్చారు. అంతేకాదు.. ఆ జీవో ప్రతులను భోగి మంటల్లో వేయాలని రాష్ట్ర ప్రజానికానికి ఆయన పిలుపు కూడా ఇచ్చారు.
Vijayasai reddy Tweet:
చిత్తుగా ఓడిపోయి రెండేళ్లవుతున్నా ఎలా ఓడిపోయాడో తెలియదంట సంక్రాంతి సృష్టికర్తనని చెప్పుకునే బాబు గారికి.
పైగా సారీ-పూర్తిగా మారిపోయానంటూ కొత్త డ్రామాలు మొదలెట్టారు. ఎన్నిసార్లు మారతారు బాబు గారూ? దేవాలయాలు ధ్వంసం చేస్తూ తన ఓటమికి ఇంకా ప్రజల్నే నిందిస్తున్నాడు
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 14, 2021