జనసేన అధినేత పవన్ పొలిటికల్ స్పీచ్‌లో సౌండ్ సాలిడ్‌గా వినిపిస్తోంది. ఏలూరు సభలో వైసీపీ టార్గెట్‌గా రెచ్చిపోయారు ఈ బీమ్లా నాయక్. హలో ఏపీ.. బైబై వైసీపీ నినాదంతో అధికార పార్టీ తప్పొప్పులను ఎత్తి చూపుతూ సంచనల కామెంట్స్ చేశారు. దీంతో వైసీపీ ఫైరింగ్ సెన్షన్ డిపార్ట్‌మెంట్ అలర్ట్ అయిపోయింది. వారాహి యాత్ర వెబ్ సిరీస్‌ను తలపిస్తోందని సెటైర్లు పేల్చారు.
రెండవ విడత వారాహి యాత్రలో మొదట రోజే వైసీపీ సర్కారుపై విమర్శల బాణం ఎక్కపెట్టారు పవర్ స్టార్. సీఎం జగన్ టార్గెట్గా సంచనల కామెంట్స్ చేశారు. తాను ఏం మాట్లాడినా జగన్ వెకిలితనం ప్రదర్శిస్తున్నారని .. అలాంటి వ్యక్తిని ఇకపై నుంచి తాను ఏకవచనంతోనే పిలుస్తానంటూ ఏలూరు సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్న జగన్ ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కాదని.. పదవి నుంచి దిగిపోగానే జగన్‌ను వాడవాడలా వెంటాడుతామని హెచ్చరించారు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా తల్లినీ.. నా భార్యనీ తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం భరిస్తున్నానని సభలో భావోద్వేగ ప్రసంగం చేశారు.
పవన్ వారాహి యాత్రపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో పవన్ ఎప్పటికీ సైడ్ హీరోనని అన్నారు మంత్రి అమర్నాథ్. పవన్ వారాహిపై యాత్ర వెబ్ సిరీస్‌ను తలపిస్తోందని సెటైర్లు విసిరారు.
అటు ఉభయగోదావరి రీజినల్ కో ఆర్డినేటర్ మిధున్‌రెడ్డి పవన్ వ్యాఖ్యలపై స్పందించారు. పవన్ ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు..? సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నించారు.
లోకేశ్ యాత్ర ఫెయిలవ్వడంతో పవన్ వారాహి వాహనంతో రోడ్ల వెంట తిరుగుతున్నారని ఎంపీ నందిగం సురేష్ సెటైర్లు వేశారు. మొత్తంగా పవన్ వారాహి యాత్రతో ఏపీలో రాజకీయ వేడి రాజుకుంటోంది. సభలో పొలిటికల్ భీమ్లా నాయక్ స్పీచ్‌కు అంతే స్థాయిలో కౌంటర్లు వేస్తున్నారు వైసీపీ నేతలు. దీంతో ఏపీలో అప్పుడే ఎన్నికల హీట్ కనిపిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..