
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారంటూ వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. విశాఖ మేయర్ అవిశ్వాస తీర్మానాన్ని ఉద్దేశించి ట్వీట్ చేసిన వైసీపీ అధినేత జగన్.. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేశారన్నారు. బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్‌గా ఉన్న బీసీ మహిళను పదవి నుంచి దించేసారు.. టీడీపీ చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం అని అన్నారు జగన్. 98 డివిజన్లలో ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 58 స్థానాల్లో వైసీపీ, 30 స్థానాల్లో టీడీపీ గెలిచింది. మరి టీడీపీకి మేయర్ పదవి ఏ రకంగా వస్తుంది? అంటూ జగన్ ప్రశ్నించారు.
బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ యాదవ కులానికి చెందిన మహిళను మేయర్ పదవిలో కూర్చోబెట్టామంటూ జగన్ పేర్కొన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తమ పార్టీ కార్పొరేటర్లు విడిది చేసిన హోటల్‌పై మీ పార్టీ నాయకులు, పోలీసులతో దాడులు చేయించారని జగన్ మండిపడ్డారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా వీడియోలు ప్రజల ముందే ఉన్నాయి. మరి దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? అవిశ్వాసం ప్రక్రియ స్వేచ్ఛగా జరిగిందని అనుకోవాలని అంటారా? ఇది అధికార దుర్వినియోగం కాదా? అని జగన్ ప్రశ్నించారు.
మరో ఏడాది గడిస్తే ఇప్పుడున్న కౌన్సిల్ పదవీకాలం పూర్తవుతుంది, మళ్లీ ఎన్నికలు వస్తాయి, చేసిన పనులు చెప్పి ఓట్లు అడిగే ధైర్యం మీకు లేదా అంటూ.. జగన్.. చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు. మీ అప్రజాస్వామిక విధానాలకు దేవుడు, ప్రజలే గుణపాఠం చెప్తారంటూ జగన్ పేర్కొన్నారు.
.@ncbn గారు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్‌గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడం, మీరు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం.
ప్రజలు ఇచ్చిన…
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 19, 2025
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..