Andhra: ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.. ఆ ఫోటోలు వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు.. సీన్ కట్ చేస్తే.!

అమ్మాయి, అబ్బాయి ఇష్టపడ్డారు. ఇంట్లో చెప్పారు. కానీ కులం పెళ్లికి అడ్డమైంది. పెద్దలు నో చెప్పారు. ఐతే.. ఏదేమైనా కలిసే ఉండాలని ఫిక్సైన ఇద్దరూ గుళ్లో పెళ్లి చేసుకున్నారు. ఇది తెలిసి అమ్మాయి బంధువులు అబ్బాయిపై దాడి చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Andhra: ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.. ఆ ఫోటోలు వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు.. సీన్ కట్ చేస్తే.!
Telugu News

Updated on: Jan 01, 2026 | 1:19 PM

ఏలూరు జిల్లాలో ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిపై దాడి జరిగింది. స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టారు అమ్మాయి తరపు బంధువులు. ముసునూరు మండలం రమణక్కపేటలో ఈ ఘటన జరిగింది. సాయిచంద్‌ తన పెళ్లి ఫోటోలు వాట్సప్‌ స్టేటస్‌లో పెట్టడంతో.. విషయం తెలిసి యువకుడిపై దాడి చేశారు అమ్మాయి బంధువులు. పెళ్లి విషయంలో ఇంతకుముందే ఇరువర్గాల మధ్య గొడవలు జరిగాయి. తమని కాదని పెళ్లి చేసుకున్నందుకు ఆగ్రహంతోనే అమ్మాయి బంధువులు దాడి చేశారు.

కనుకొల్లుకు చెందిన అమ్మాయిని మండవల్లికి చెందిన సాయిచంద్ ప్రేమించాడు. అబ్బాయి కాపు సామాజికవర్గం, అమ్మాయి యాదవ కావడంతో.. ఇంట్లో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. వాళ్లను ఒప్పించే ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇద్దరూ గుళ్లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్లు వాట్సప్‌ స్టేటస్‌లో పెళ్లి ఫొటో పెట్టడంతో అమ్మాయి బంధువులు కోపంతో రగిలిపోయారు. అమ్మాయి రమణక్కపేట పోస్టాఫీస్‌లో ఉద్యోగం చేస్తోంది. ఎలాగైనా ఇద్దరూ అక్కడికి వస్తారని తెలిసి మాటు వేశారు. సాయిచంద్‌ తన భార్యను తీసుకుని రాగానే అతనిపై దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్లిపోయారు. కాగా, దాడి ఘటనపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు సాయిచంద్‌. తనను కొట్టి తన భార్యను కిడ్నాప్ చేశారని కంప్లైంట్‌ చేశాడు. తీవ్రంగా గాయపడ్డ అతను ప్రస్తుతం నూజివీడు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి