AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంతకు తెగించావ్‌రా.. చల్లటి ఐస్ క్రీమ్ తినిపించాడు.. కసిగా గొంతు కోసాడు..! కారణం తెలిస్తే..

ఒకరిని పెళ్లి చేసుకున్నాడు.. మరొక మహిళనూ మనువాడి ఉన్నాడు.. ఇద్దరు భార్యలు సరిపోలేదన్నట్టు ఇంకొక మహిళను ట్రాప్ చేశాడు.. మోజు తీరాక.. మొదటి ఇద్దరి కోసం మూడో మహిళ అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు.. సినీ స్టైల్ లో పక్కా స్కెచ్ వేసి.. ప్రియురాలిని మాటల్లో పెట్టి మర్డర్ చేశాడు.. ఐస్ క్రీమ్ తినిపించి.. సరదాగా విహారం అని నమ్మించి.. తీసుకెళ్లి అంతమొందించాడు.

ఎంతకు తెగించావ్‌రా.. చల్లటి ఐస్ క్రీమ్ తినిపించాడు.. కసిగా గొంతు కోసాడు..! కారణం తెలిస్తే..
Crime News
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Shaik Madar Saheb

Updated on: May 10, 2025 | 4:07 PM

ఒకరిని పెళ్లి చేసుకున్నాడు.. మరొక మహిళనూ మనువాడి ఉన్నాడు.. ఇద్దరు భార్యలు సరిపోలేదన్నట్టు ఇంకొక మహిళను ట్రాప్ చేశాడు.. మోజు తీరాక.. మొదటి ఇద్దరి కోసం మూడో మహిళ అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు.. సినీ స్టైల్ లో పక్కా స్కెచ్ వేసి.. ప్రియురాలిని మాటల్లో పెట్టి మర్డర్ చేశాడు.. ఐస్ క్రీమ్ తినిపించి.. సరదాగా విహారం అని నమ్మించి.. తీసుకెళ్లి అంతమొందించాడు. విశేషమెంటంటే.. ఆమెతో పాటే వెళ్లి అనుమానం రాకుండా పెట్రోల్ కొనుగోలు చేసి అదే పెట్రోల్ పోసి ఆమెను తగలబెట్టాడు. సస్పెన్స్ త్రిల్లర్ క్రైమ్ కథ చిత్రాన్ని తలపించిన భీమిలి దాకమర్రి లేఔట్ లో మహిళ మర్డర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మే.. 2వ తేదీ… భీమిలి పోలీస్ స్టేషన్ పరిధి.. తగరపువలస – విజయనగరం రోడ్డు.. ఉదయాన్నే ఒకటే అలజడి..! రోడ్డుకి ఆనుకొని ఉన్న ఫార్చ్యూన్ లేఅవుట్లో.. సగం కాలిన మహిళ మృతదేహం. ముఖం గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది. అటుగా వెళుతున్న మేకల కాపరికి మృతదేహం కనిపించింది.. స్థానికులకు సమాచారం అందించగానే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. ముఖం గుర్తుపట్టలేనంతగా ఉండడంతో.. ఒంటిపై ఉన్న వస్త్రాలు పింక్ కలర్ టాప్.. పింక్ కలర్ లెగ్గిన్, కాలికి మెట్టలు ఫోటోలను తీసి అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు పోలీసులు. మిస్సింగ్ కంప్లైంట్స్ పై ఆరా తీశారు.

కాల్ డేటాలో…

గంటలు గడుస్తున్న ఎటువంటి క్లూ లభించలేదు.. మృతురాలి కాల్ డేటాను విశ్లేషించారు పోలీసులు. దీంతో మృతురాలి ఆచూకీ లభించింది. మధురవాడ మాలిక వలస ప్రాంతానికి చెందిన వెంకటలక్ష్మిగా గుర్తించారు పోలీసులు. కూపీ లాగితే.. ఆ ముందు రోజు ఒక వ్యక్తితో వెళ్లినట్టు సీసీ కెమెరాలు ఆధారంగా గుర్తించగలిగారు పోలీసులు. వెరిఫై చేసేసరికి క్రాంతి కుమార్ యవ్వారం బయటపడింది. అయితే ఈ విషయం మృతురాలి కుటుంబ సభ్యులకు తెలియక తలడిల్లిపోయారు.

అలా పరిచయం.. అదీ అసలు విషయం..

నిందితుడని అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయం బయటపడింది. విజయనగరం జిల్లా డెంకాడ కు చెందిన వెంకటలక్ష్మి.. పదేళ్ల క్రితం భర్త చనిపోయాడు. ఇద్దరు కొడుకులతో కలిసి వెంకటలక్ష్మి మధురవాడ మాలిక వలసలోని రాజీవ్ గృహాల బ్లాక్ నెంబర్ 121 లో ఎస్ ఎఫ్ 4 లో నివాసం ఉంటుంది. ఇద్దరు మగ పిల్లలు డిగ్రీ చదువుతూ ఉన్నారు. మరోవైపు ఒడిస్సాలోనే రాయగడ జిల్లా కాంపోమల్లిగాం కు చెందిన క్రాంతి కుమార్.. మొదటి భార్య ఉండగానే రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య, పిల్లలు తగరపువలసలో నివాసం ఉంటున్నారు. రెండో భార్యను నాలుగేళ్ల క్రితం రాజీవ్ గృహకల్పలో ఓ ఇంట్లో ఉంచాడు. ప్రస్తుతం హత్యకు గురైన వెంకటలక్ష్మి.. క్రాంతి కుమార్ రెండో భార్య ఇంటి పక్కనే నివాసం ఉంటుంది. ఈ క్రమంలో వెంకటలక్ష్మికి క్రాంతి కుమార్ కి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.

అందుకే అడ్డు తొలగించుకోవాలని..

వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం విషయం రెండో భార్యకు తెలిసిపోవడంతో.. క్రాంతి కుమార్ తో ఆమె గొడవ పడింది. దీంతో అదే కాలనీలోనే మరో బ్లాక్ కు రెండో భార్యను షిఫ్ట్ చేశాడు క్రాంతికుమార్. మొదటి భార్యకు కూడా వెంకటలక్ష్మి వ్యవహారం తెలిసిపోయింది. ఇద్దరు భార్యలు క్రాంతి కుమార్ ను వెంకటలక్ష్మి వ్యవహారంలో నిలదీస్తున్నారు. మరోవైపు.. ఇద్దరు భార్యలు లాగానే తనకు మరొక ఇంట్లో పెట్టి.. నెలనెలా ఎంతో కొంత తనకు ఖర్చులకు ఇవ్వాలని ఒత్తిడి చేస్తోంది. తనతో ఎక్కువ సమయం కేటాయించాలని చెప్పడంతో.. ఇక ఇద్దరు భార్యలతో పాటు వెంకటలక్ష్మి ఒత్తిడి తట్టుకోలేకపోయాడు. అప్పటికే ఇద్దరు భార్యలతో గొడవలు జరుగుతుండడంతో.. వెంకటలక్ష్మిని ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు క్రాంతి కుమార్. పక్కా స్కెచ్ వేసుకున్నాడు.

పక్కా ప్లాన్ తో..

ఈనెల ఒకటో తేదీ రాత్రి ఎనిమిది గంటలకు వెంకటలక్ష్మి కాల్ చేశాడు క్రాంతికుమార్. సరదాగా షికారుకి వెళ్దామని చెప్పేసరికి ఆమె అతన్ని నమ్మేసింది. క్రాంతి కుమార్ కాల్ చేయడంతో.. ఫంక్షన్కు వెళ్లి వస్తానని ఇద్దరు కొడుకులకు చెప్పి బయటకు వెళ్ళింది వెంకటలక్ష్మి. ఇద్దరు ఒక చోట కలిసి బైక్ పై బయలుదేరారు. మధురవాడ నుంచి బయలుదేరి కైలాసగిరి ప్రాంతంలోని బీచ్ కు ఆనుకొని ఉన్న తేన్నేటి పార్కు వెళ్లారు. అక్కడ ఐస్ క్రీమ్ ను ఇప్పించాడు క్రాంతి కుమార్. ఇద్దరు కలిసి సరదాగా ఐస్ క్రీమ్ తిన్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి బయలుదేరి క్రాంతి కుమార్ పెట్రోల్ బంకుకు ఆమె తీసుకెళ్లాడు. కొంత పెట్రోల్ బంక్ లో వేయించి మరికొంత తనతో తెచ్చుకున్న బాటిల్ లో పట్టాడు. అదేమని ప్రశ్నిస్తే.. తిరగడానికి పెట్రోల్ సరిపోదని.. దీంతోపాటు ఇంటిదగ్గర బైక్ పెడితే పెట్రోల్ చోరీ చేస్తున్నారని.. దాంతోపాటు ఉదయాన్నే డ్యూటీ కి వెళ్లడానికి ఇబ్బంది పడే బదులు ముందే పెట్రోల్ సిద్ధం చేసుకుంటే బెటర్ అని నమ్మించాడు. దీంతో వెంకటలక్ష్మికి ఎటువంటి అనుమానం కలగలేదు. పెట్రోల్ బంక్ నుంచి తిమ్మాపురం వైపు వెళ్లారు ఇద్దరు కలిసి. అక్కడ రామాద్రిపురం బీచ్ వద్దకు వెళ్లి నూడుల్స్ ఆర్డర్ చేసుకున్నారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నూడుల్స్ తిన్నారు. అక్కడ నుంచి బయలుదేరి దాకా మరి రఘు కాలేజ్ రోడ్డులో.. టీ టైమ్ దగ్గర ఆగారు. క్రాంతి కుమార్ వెంకటలక్ష్మి ఇద్దరూ కాఫీ తాగారని అన్నారు సీపీ శంకబ్రత బాగ్చి..

వాడి మాటల వెనుక మర్మాన్ని గమనించలేక..

ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో.. శారీరకంగా కలుద్దామని ఆమెను నమ్మించి ఒప్పించాడు. ఫార్చ్యూన్ లేఅవుట్ లోనికి వెళ్దాం అన్నాడు. వాడి మాటల వెనుక మర్మాన్ని గుర్తించలేకపోయిన వెంకటలక్ష్మి.. సరేనని ఒప్పుకుంది. అక్కడకు వెళ్లాక చీకట్లో.. ఆమె చనువుగా ఉన్న సమయంలో.. తనతో తెచ్చుకున్న కత్తితో వెంకటలక్ష్మి గొంతు కోశాడు. దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మెడలోని ఆభరణాలు, చెవి దిద్దులు తీసుకొని.. జేబులో వేసుకున్నాడు. ప్లాన్ ప్రకారం అప్పటికే తనతో పాటు బాటిల్ లో తెచ్చుకున్న పెట్రోల్ ను వెంకటలక్ష్మి ముఖంపై వేసి.. నిప్పు పెట్టాడు. అక్కడ నుంచి పారిపోయాడు క్రాంతి కుమార్. ఆ మర్నాడు సగం కాలిన మృతదేహం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో.. సిపి బాగ్చి సీరియస్ గా దృష్టిసారించారు. ఏసిపి అప్పలరాజు, భీమిలి సిఐ తో పాటు.. నార్త్ ఏసిపి పరిధిలోని సీఐలను అలెర్ట్ చేశారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మృతదేహాన్ని మార్చురికి తరలించారు. ఘటనా స్థలంలో మృతురాలి శరీరంపై ఉన్న దుస్తులు వస్తువులు ఆనవాళ్లను సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో మృతురాలి ఆచూకీ లభ్యమయింది. వెంకటలక్ష్మి కాల్ డేటా ఆధారంగా నిందితుడు క్రాంతికుమార్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విచారించేసరికి.. అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు. 6 గంటల వ్యవధిలోనే.. కేసును చేదించి నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు సీపీ బాగ్చి.

వెంకటలక్ష్మికి అత్యంత దారుణంగా హత్య చేసిన క్రాంతి కుమార్ పై.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మృతురాలి కుటుంబ సభ్యులు. శిక్ష ఎలా ఉండాలంటే క్రాంతి కుమార్ లా ఆలోచించే వారికి వణుకు పుట్టేలా ఉండాలంటున్నారు మృతురాలి తండ్రి ఆదినారాయణ, కుటుంబ సభ్యులు..

గంటల వివదిలోనే కేసును చేధించి..

భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో దాకామర్రి లేఅవుట్లో సగం కాలిన మహిళ మృతదేహం.. ఆమె హత్య కోసం నిందితుడి స్కెచ్ ఖాకైలనే కలవరం పుట్టించింది. పరుగులు పెట్టించింది.. అయినప్పటికీ ఎంత కొమ్ములు తిరిగిన నేరస్తుడైనా సరే ఖాకీల ముందు మోకాలు మోపక తప్పదు కదా.. అలాగే విశాఖ పోలీసులు ఈ సెన్సేషన్ కేసును గంటల వ్యవధిలోనే ఛేదించి శభాష్ అనిపించుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అబ్బో ఆమె బ్యాగ్రౌండ్ మాములుగా లేదుగా..!!
అబ్బో ఆమె బ్యాగ్రౌండ్ మాములుగా లేదుగా..!!
ప్రొటీన్‌కి పవర్‌హౌస్.. అటుకులతో ఇన్ని వెరైటీలు చేయొచ్చా..
ప్రొటీన్‌కి పవర్‌హౌస్.. అటుకులతో ఇన్ని వెరైటీలు చేయొచ్చా..
మర్డర్ కేసులో ప్రముఖ హీరోయిన్ అరెస్ట్.. పీకల్లోతు చిక్కుల్లో నటి!
మర్డర్ కేసులో ప్రముఖ హీరోయిన్ అరెస్ట్.. పీకల్లోతు చిక్కుల్లో నటి!
రూపం మార్చుకుని దూసుకొస్తోంది.. ఈసారి కరోనా మరింత డేంజర్‌గా.!
రూపం మార్చుకుని దూసుకొస్తోంది.. ఈసారి కరోనా మరింత డేంజర్‌గా.!
పెళ్ళైన 15 రోజులకే కనిపించకుండాపోయిన భర్త.. పాపం సినిమాలు మానేసి
పెళ్ళైన 15 రోజులకే కనిపించకుండాపోయిన భర్త.. పాపం సినిమాలు మానేసి
అసలేం జరిగింది..? గుల్జార్ హౌస్ ప్రమాదానికి అనేక కారణాలు..
అసలేం జరిగింది..? గుల్జార్ హౌస్ ప్రమాదానికి అనేక కారణాలు..
ఈపీఎఫ్‌వోలో ఈ ఐదు కీలక మార్పుల గురించి మీకు తెలుసా..?
ఈపీఎఫ్‌వోలో ఈ ఐదు కీలక మార్పుల గురించి మీకు తెలుసా..?
US మాజీఅధ్యక్షుడు జో బైడెన్‌కు 'క్యాన్సర్'.. ట్రంప్ రియాక్షన్ ఇదే
US మాజీఅధ్యక్షుడు జో బైడెన్‌కు 'క్యాన్సర్'.. ట్రంప్ రియాక్షన్ ఇదే
పొలంలో వాగు సమీపాన ఏదో మెరుస్తూ కనిపించింది.. ఏంటని తవ్వి చూడగా
పొలంలో వాగు సమీపాన ఏదో మెరుస్తూ కనిపించింది.. ఏంటని తవ్వి చూడగా
జ్ఞాపకాల తోటలో..ఏప్రిల్ మెమోరీస్ అంటూ ఫొటోలు షేర్ చేసిన అల్లు స్న
జ్ఞాపకాల తోటలో..ఏప్రిల్ మెమోరీస్ అంటూ ఫొటోలు షేర్ చేసిన అల్లు స్న
పండిన మామిడికే కాదు.. పచ్చి మామిడికీ మస్తు డిమాండ్..
పండిన మామిడికే కాదు.. పచ్చి మామిడికీ మస్తు డిమాండ్..
తాటి ముంజలు తినకపోతే.. ఎన్ని మిస్సవుతారో తెలుసా ??
తాటి ముంజలు తినకపోతే.. ఎన్ని మిస్సవుతారో తెలుసా ??
వైభవంగా రుక్మిణి సత్యభామ సమేత మోహన కృష్ణ స్వామి గరుడ వాహన సేవ..
వైభవంగా రుక్మిణి సత్యభామ సమేత మోహన కృష్ణ స్వామి గరుడ వాహన సేవ..
350 గ్రాముల గోల్డ్ బిస్కెట్.. తవ్వకాల్లో బయటపడిందన్నారు.. తర్వాత
350 గ్రాముల గోల్డ్ బిస్కెట్.. తవ్వకాల్లో బయటపడిందన్నారు.. తర్వాత
క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌.. ఆ దార్శనికుడి బయోపిక్‌లో వీడియో
క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌.. ఆ దార్శనికుడి బయోపిక్‌లో వీడియో
పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతున్నారా..ఇదిగో పరిష్కారం వీడియో
పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతున్నారా..ఇదిగో పరిష్కారం వీడియో
వేసవిలో బొప్పాయి పండు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే వీడియో
వేసవిలో బొప్పాయి పండు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే వీడియో
పెళ్లి వేడుకల్లో అపశృతి డ్యాన్స్ చేస్తుండగా డీజే సౌండ్ల మధ్య హార్
పెళ్లి వేడుకల్లో అపశృతి డ్యాన్స్ చేస్తుండగా డీజే సౌండ్ల మధ్య హార్
పీచ్‌ పండుతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు వీడియో
పీచ్‌ పండుతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు వీడియో
ఈ సమస్యలు ఉంటే చియా విత్తనాలను దూరం పెట్టండి..వీడియో
ఈ సమస్యలు ఉంటే చియా విత్తనాలను దూరం పెట్టండి..వీడియో