తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భర్త హత్యకు గురైన ఐదు రోజులకే భార్య ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పిఠాపురంకు చెందిన శ్రీపాద వల్లభ మహాసంస్థానం ఎదురుగా ఉన్న వీధిలో ఈ నెల 8న రెడ్డెం శ్రీనివాస్‌ను క్రూరంగా మర్డర్ చేశారు. కాళ్లు, చేతులు మంచానికి కట్టేసి రాడ్డుతో కొట్టి దారుణంగా చంపాంరు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. హత్యకు దారి తీసిన కారణాలపై విచారణ సాగిస్తున్నారు.
ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే.. శుక్రవారం మధ్యాహ్నం శ్రీనివాస్ భార్య స్వరూపారాణి కాస్త నలతగా ఉందని.. విశ్రాంతి తీసుకుంటానని కుటుంబ సభ్యులకు చెప్పింది. కొద్దిసేపటి తర్వాత ఆమె ఫ్యానుకు ఉరి వేసుకుని తనువు చాలించింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు డెడ్‌బాడీని కిందికి దింపి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఐదు రోజుల వ్యవధిలోనే దంపతులిద్దరూ చనిపోవడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. భార్యాభర్తల మృతితో కుటుంబ సభ్యులు, పిల్లలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
శ్రీనివాస్ మొదటి భార్య చనిపోవడంతో ఏడేళ్ల క్రితం స్వరూప రాణిని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. అప్పటికే ఆయనకు కృష్ణవంశీ, గీతిక అనే ఇద్దరు పిల్లలున్నారు. స్వరూపారాణికి ఒక కుమారుడు వరుణ్ సంతోష్ ఉన్నాడు. శ్రీనివాస్ తండ్రి సత్తిరాజుతో పాటు భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు. భార్యాభర్తలు ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవారని.. ఇలా ఎందుకు జరిగిందో తెలియంలేదని కుటుంబ సభ్యులు, బంధువులు అంటున్నారు.
Also Read:
Uppena first day collection: మెగా మేనల్లుడి రికార్డ్.. తొలిరోజు ‘ఉప్పెన’లా వచ్చిన కలెక్షన్స్