విశాఖ ఆర్కే బీచ్‌లో దారుణం జరిగింది. ఓ మహిళ అనుమానాస్పద మృతి అందర్నీ షాక్‌కి గురిచేసింది. డెడ్‌బాడీ పడి ఉన్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. మృతదేహం ఇసుకలో కూరుపోగా కేవలం ముఖం మాత్రమే బయటకు కనిపిస్తోంది. ఇది హత్యా..? ఆత్మహత్యా అన్నది అంతుపట్టకుండా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. మహిళ గాజువాక నడుపూరికి చెందిన స్వాతిగా గుర్తించారు. నిన్న సాయంత్రం నుంచి ఇంట్లోంచి బయటకు వెళ్లింది. రాత్రి అయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో కంగారుపడ్డ కుటుంబసభ్యులు.. పోలీసుల్ని ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తుండగానే స్వాతి ఆర్కేబీచ్‌లో శవమై తేలింది. అయితే డెడ్‌బాడీ పడి ఉన్న తీరుపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
డెడ్‌బాడీ పడి ఉన్న తీరు చూస్తే హత్యేనన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఒంటిపై దుస్తులు సరిగా లేవు.. ఇసుకలో సగం డెడ్‌బాడీ కప్పేసినట్టుగా ఉంది. ఇది ఎవరో కావాలని చంపేసి.. తమ ఆనవాళ్లు దొరక్కుండా ఇసుకలో పాతిపెట్టినట్టు తెలుస్తోంది. ఆర్కేబీచ్ ఒడ్డున ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో చనిపోవడం అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. నడుపూరునకు చెందిన స్వాతికి పెళ్ళై ఏడాది.. ఐదు నెలల గర్భిణీ అని పేర్కొంటున్నారు. అదృశ్యం కాకముందు భర్తతో ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం..
మిస్సింగ్ కేసు కాస్త మిస్టీరియస్ డెత్‌గా మారింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో ఆరాతీస్తున్నారు. స్వాతి ఇంట్లోంచి బయటకు ఎందుకు వెళ్లింది..? బయటకు వెళ్లాక ఎవర్ని కలిసింది..స్వాతిది ఆత్మహత్యా? మరేదైన అఘాయిత్యమా అన్న కోణంలో దర్యాప్తు ఆ తర్వాత ఆర్కేబీచ్ పరిసరాలకు ఎవరితో వెళ్లింది..స్వాతిది ఆత్మహత్యా? మరేదైన అఘాయిత్యమా అన్న కోణంలో దర్యాప్తు స్వాతి మొబైల్ ఫోన్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..