Chandrababu Naidu: ప్రధాని మోదీ విషయంలో మారిన చంద్రబాబు స్వరం..(Watch Video)

Chandrababu Naidu: ప్రధాని మోదీ విషయంలో మారిన చంద్రబాబు స్వరం..(Watch Video)

Janardhan Veluru

|

Updated on: Apr 26, 2023 | 12:11 PM

ప్రధాని నరేంద్ర మోదీ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్వరం మార్చారు.  ఏమాత్రం చిన్న అవకాశం దొరికినా..ప్రధాని మోదీని మోసేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎలాగైనా మోదీకి దగ్గరయ్యేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్వరం మార్చారు.  ఏమాత్రం చిన్న అవకాశం దొరికినా..ప్రధాని మోదీని మోసేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎలాగైనా మోదీకి దగ్గరయ్యేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలో జరిగిన ఓ జాతీయ మీడియా కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు.. తానెప్పుడూ మోదీ పాలసీలను వ్యతిరేకించలేదని చెప్పుకొచ్చారు. పైగా మోదీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నానని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో మాత్రమే ప్రధానితో విభేదించానని..మిగతా అన్ని విషయాల్లో తానెప్పుడూ మద్దతుగానే ఉంటానన్నారు. ఇక రూ. 500 నోట్లతోపాటు.. అంతకంటే పెద్ద నోట్లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.

Published on: Apr 26, 2023 11:48 AM