మహిళ మృతదేహం కలకలం.. సగం కాలిన స్థితిలో.. అసలేం జరిగింది
కృష్ణా(Krishna) జిల్లాలో సగం కాలిన స్థితిలో మహిళ మృతదేహం(Dead body) లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు..
కృష్ణా(Krishna) జిల్లాలో సగం కాలిన స్థితిలో మహిళ మృతదేహం(Dead body) లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరించారు. ఐదు రోజుల కిందటే ఈ హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. చంపేసిన(Murder) తర్వాతే ఇక్కడికి తీసుకువచ్చి పెట్రోల్ పోసి, తగలబెట్టారని అనుమానిస్తున్నారు. ఎవరైనా మహిళలు అదృశ్యమైనట్లు అనిపిస్తే సమాచారం అందించాలని సూచించారు. కృష్ణా జిల్లా మైలవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో చెట్టు కింద మహిళ మృతదేహం ఉన్నట్లు అటవీ శాఖ అధికారులకు పశువుల కాపరులు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, పోలీసులు మృతదేహాన్ని, పరిసరాలను పరిశీలించారు.
గుర్తుపట్టని విధంగా కాలిన మృతదేహం వివరాలు తెలియాల్సి ఉందని, ఎవరైనా మహిళలు అదృశ్యమైనట్లు అనిపిస్తే సమాచారం అందించాలని కోరారు. మృతి చెందిన మహిళ వయస్సు సుమారు 30 ఏళ్లు ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతురాలిని అటవీ ప్రాంతంలోకి తెచ్చి, ఉరి వేయడంతో ఆమె మృతి చెందిందని భావిస్తున్నారు. కాళ్లకు వేసుకున్న చెప్పులు అలాగే ఉండడంతో హత్య చేసిన తరువాతే.. పెట్రోల్ పోసి తగలబెట్టారని చెప్పారు. ఐదు రోజుల కిందటే ఈ హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. సంఘటనా స్థలంలో ఒక శీతల పానీయం, మంచినీళ్ల సీసాలను స్వాధీన పర్చుకున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
Stock Market: మొదలైన రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
Mileage Bikes: సామాన్యుడి బతుకుబండి నడిపిస్తున్న 4 బైక్‌లు.. ధర తక్కువ మైలేజ్ ఎక్కువ..!