Andhra Pradesh: ప్రేమగా వెళ్తే బ్లేడుతో షాకిచ్చింది.. ప్రియుడి మర్మాంగం కోసిన ప్రియురాలు.. కారణం ఏంటంటే..?

Woman attacked her lover: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసింది. ఈ షాకింగ్ ఘటన

Andhra Pradesh: ప్రేమగా వెళ్తే బ్లేడుతో షాకిచ్చింది.. ప్రియుడి మర్మాంగం కోసిన ప్రియురాలు.. కారణం ఏంటంటే..?
Crime News

Updated on: Sep 17, 2022 | 6:14 PM

Woman attacked her lover: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసింది. ఈ షాకింగ్ ఘటన జిల్లాలోని కొండపి మండలం మూగచింతల గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. మూగచింతలకు చెందిన సీహెచ్‌ హరినారాయణకు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో చాలా కాలం నుంచి వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఎప్పటిలాగే ఆమె ప్రియుడు.. మహిళ ఇంటికి బుధవారం రాత్రి వెళ్లాడు. ఈ సమయంలో కాసేపు సన్నిహితంగా ఉన్న ఆమె.. ముందస్తు పథకం ప్రకారం తాను తెచ్చుకున్న బ్లేడుతో దాడి చేసింది. క్షణంలోనే ప్రియుడి మర్మాంగాన్ని కోసేసి.. అక్కడినుంచి పరారైంది.

దీంతో బాధిత వ్యక్తి హరినారాయణ లబోదిబోమంటూ కొస్టం బయటకు పరుగులు తీశాడు. వెంటనే గమనించిన స్థానికులు అతన్ని ఒంగోలులోని ఓ ఆసుపత్రికి తరలించారు. కాగా హరినారాయణకు భార్య లేకపోవడంతో చాలా కాలం నుంచి ఆ మహిళతో సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే.. వీరిద్దరి మధ్య ఆర్థిక సంబంధాలు కూడా ఉన్నాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఆస్తి కోసమా..? లేదంటే మరేదైనా కారణంతో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడిందా అని చర్చించుకుంటున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..