Yanam: పెట్ డాగ్ చూస్తుండగానే గోదావరిలోకి దూకి యువతి ఆత్మహత్య.. పాపం అల్లాడిపోయిన శునకం

చనిపోడానికి వెళ్తూ కూడా తన పెంపుడు కుక్కను వెంట తీసుకెళ్లింది ఆమె. అది చూస్తుండగానే చెప్పులు వారధిపై విడిచి.. ఆ యువతి గోదావరిలోకి దూకి తనువు చాలించింది. దీంతో ఆ పెంపుడు కుక్క అల్లాడిపోయింది. యజమాని చెప్పుల వద్దే ధీనంగా గంటలపాటు కూర్చుంది.

Yanam: పెట్ డాగ్ చూస్తుండగానే గోదావరిలోకి దూకి యువతి ఆత్మహత్య.. పాపం అల్లాడిపోయిన శునకం
Women Suicide

Edited By: Ram Naramaneni

Updated on: Jul 18, 2023 | 7:06 PM

యానాం, జులై 18: యానాం వారధిపై చెప్పులు విడిచిపెట్టి.. గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది ఒక యువతి. యువతితో పాటు వచ్చిన పెంపుడు శునకం ఆమె వదిలిన చెప్పులు వద్దే తిరుగుతూ మధ్య మధ్యలో గోదావరి పైపు చూస్తూ గంటల తరబడి ఆమె కోసం ఎదురు చూడటం వారధిపై వెళుతున్న ప్రయాణికులను ఆశ్చర్యానికి, ఆవేదనను గురి చేసింది. హాలీవుడ్ చిత్రం హాచికో తరహాలో యజమాని కోసం యువతి చెప్పుల వద్దే తిరుగుతూ.. ఆ సీన్‌ను రిపీట్ చేసింది ఈ శునకం. నిజ జీవితంలో కూడా ఇలాంటి శునకాలు ఉంటాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్లూ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి యానాం గోదావరిలో యువతి మృతదేహాన్ని కనుగొన్నారు.

అసలు విషయానికి వెళ్తే… యానాంలో రెండు రోజుల క్రితం ఒక యువతి గౌతమీ గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె పెంపుడు శునకం ఇచ్చిన క్లూతో ఆత్మహత్య చేసుకున్న యువతి యానాం ఫెర్రీ రోడ్ లో నివాస ముంటున్న మందాకి కాంచనగా గుర్తించారు యానాం పోలీసులు. ఆత్మహత్య చేసుకున్న యువతి కాంచన కోసం గత రెండు రోజులుగా పోలీసులు గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం కాంచన మృతదేహం యానాం గోదావరిలో పోలీసులకు లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఆమె ఎందువల్ల ఆత్మహత్య చేసుకుంది అనే విషయంపై విచారణ జరుపుతున్నామని తెలిపారు యానాం పోలీసులు. ఏది ఏమైనా తనను సాకిన యువతి కళ్ళముందే గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటే ఏం చేయాలో పాలు పోక అక్కడే ఉండి.. ధీనంగా బాధపడుతూ..  పోలీసులకు సమాచారం ఇచ్చేలా చేసిన శునకానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు స్థానికులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..