Andhra Pradesh: స్నాప్‌చాట్‌‌‌లో వివాహితతో లవ్.. మాట్లాడటం లేదని ఇంటికెళ్లి ఏం చేశాడో తెలుసా..?

స్నాప్‌చాట్‌ పరిచయం, మరో అమాయకురాలు బలి అయింది. తాను ప్రేమించిన మహిళ అనుకుని.. ఓ వ్యక్తి మద్యం మత్తులో మరో మహిళపై కత్తితో దాడి చేశాడు. అడ్డొచ్చిన ఇంకో మహిళపైనా దాడి చేశాడు. ఈ ఘటనలో ఓ మహిళ చనిపోగా.. మరో మహిళ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.

Andhra Pradesh: స్నాప్‌చాట్‌‌‌లో వివాహితతో లవ్.. మాట్లాడటం లేదని ఇంటికెళ్లి ఏం చేశాడో తెలుసా..?
Crime News

Updated on: Apr 06, 2023 | 11:27 AM

స్నాప్‌చాట్‌ పరిచయం, మరో అమాయకురాలు బలి అయింది. తాను ప్రేమించిన మహిళ అనుకుని.. ఓ వ్యక్తి మద్యం మత్తులో మరో మహిళపై కత్తితో దాడి చేశాడు. అడ్డొచ్చిన ఇంకో మహిళపైనా దాడి చేశాడు. ఈ ఘటనలో ఓ మహిళ చనిపోగా.. మరో మహిళ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఓ ఉన్మాది మహిళలపై దాడికి పాల్పడిన ఘటన కోనసీమ జిల్లా అమలాపురంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమలాపురం ఏఎంజీ కాలనీకు చెందిన వివాహితతో స్నాప్‌చాట్‌లో హరికృష్ణకు పరిచయం ఏర్పడింది.. వీరిద్దరూ ఫోన్‌లో తరచూ మాట్లాడుకుంటున్న క్రమంలో స్నేహం పెరిగింది. అయితే హరికృష్ణ కొన్ని రోజుల నుంచి వివాహితను ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడు. ఈ క్రమంలో అతనిలో వచ్చిన మార్పును గమనించిన ఆమె.. ఫోన్‌ మాట్లాడడం స్నాప్‌చాట్‌లో చాట్‌చేయడం తగ్గించింది.

హరికృష్ణ ఎన్నిసార్లు ఫోన్లు చేసినా, మెసేజ్‌లు చేసినా రిప్లై ఇవ్వడం మానేసింది..తనను పూర్తిగా పట్టించుకోవడం మానేసిన వివాహితను అంతంచేయాలన్న పగతో నెల్లూరు నుంచి అమలాపురం వెళ్లాడు. ప్రేమను కాదన్న మహిళ హత్యకు ప్లాన్‌ చేసిన సైకో.. ప్లాన్‌ ప్రకారం ఇంటికి వెళ్లాడు. అప్పటికే.. ఫుల్లుగా మద్యం తాగి ఉన్న హరికృష్ణ.. మరో మహిళను, తాను ప్రేమించిన వివాహితగా భావించి చాకుతో కంఠం వద్ద బలంగా పొడిచాడు. అక్కడే ఉన్న మరో మహిళపైనా కూడా దాడి చేశాడు.

అయితే, ఈ ఘటనలో అన్నెంపున్నెం ఎరుగని పనిమనిషి చనిపోయింది. సంచలనం రేకెత్తించిన ఇద్దరు మహిళలపై దాడి కేసులో 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..