
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా చంపడమే కాకుండా ఆ తర్వాత ఆ మహిళ ప్రవర్తించిన తీరు పోలీసులనే విస్మయానికి గురిచేసింది. గుంటూరు జిల్లా చిలువూరులో ఈ దారుణం ఘటన చోటుచేసుకుంది. చిలువూరుకు చెందిన ఉల్లిపాయల వ్యాపారి శివనాగరాజుకు, లక్ష్మీమాధురితో 2007లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయవాడలో పనిచేస్తున్న సమయంలో మాధురికి గోపి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది అక్రమ సంబంధానికి దారితీసింది. భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం వేసిన మాధురి పక్కా ప్లాన్‌తో అతడిని అంతమొందించింది.
ఈ నెల 18న రాత్రి భర్త కోసం బిర్యానీ వండిన మాధురి, అందులో 20 నిద్రమాత్రల పొడిని కలిపింది. భర్త గాఢ నిద్రలోకి వెళ్లగానే ప్రియుడు గోపిని ఇంటికి పిలిపించింది. గోపి అతడి ఛాతీపై కూర్చోగా, మాధురి దిండుతో ముఖాన్ని అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది. భర్త చనిపోయిన తర్వాత ప్రియుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ మాధురి మాత్రం ఏమీ జరగనట్టు శవం పక్కనే కూర్చుని రాత్రంతా సెల్‌ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది.
తెల్లవారుజామున తన భర్త గుండెపోటుతో చనిపోయాడని మాధురి ఇరుగుపొరుగును నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే భర్తతో గొడవలు, వివాహేతర సంబంధం గురించి తెలిసిన చుట్టుపక్కల వారిని మాధురిని అనుమానించారు. ఈ క్రమంలో అంత్యక్రియలకు వచ్చిన అతడి ఫ్రెండ్స్.. నాగరాజు చెవిలో రక్తాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోస్ట్‌మార్టం నివేదికలో అసలు విషయం బయటపడింది. నివేదికలో నాగరాజు ఛాతీ ఎముకలు విరిగినట్లు, గాలి ఆడకపోవడం వల్లే మరణించినట్లు స్పష్టమైంది. పోలీసుల విచారణలో మాధురి తన నేరాన్ని అంగీకరించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..