AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: భర్త అదృశ్యం అంటూ కంప్లైంట్.. బ్రిడ్జి కింద కుళ్లిన స్థితిలో వ్యక్తి మృతదేహం.. విచారణలో సంచలన నిజం

విశాఖలో ప్రొఫెసర్‌ మురళీ మిస్సింగ్ మిస్టరీ వీడింది. విచారణలో సంచలన నిజాలు వెలుగుచూశాయి. కి'లేడీ' ఎంతకు తెగించిందో తెలిస్తే మీరు కంగుతింటారు.

Vizag: భర్త అదృశ్యం అంటూ కంప్లైంట్.. బ్రిడ్జి కింద కుళ్లిన స్థితిలో వ్యక్తి మృతదేహం.. విచారణలో సంచలన నిజం
Ap Crime News
Ram Naramaneni
|

Updated on: Jul 21, 2022 | 12:56 PM

Share

Andhra Pradesh: విశాఖలో ప్రొఫెసర్‌ మురళీ మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. అదృశ్యం కాదు హత్యేనని తేల్చారు పోలీసులు. హత్యకు కథ, స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌ మురళీ భార్యేనని కన్‌ఫామ్ చేశారు. ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా హతమార్చిన మృదుల దుర్మార్గం అందర్నీ షాక్‌కి గురిచేసింది. మారికవలస జాతీయ రహదారిపై బ్రిడ్జి కింద మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే మృతదేహం కుళ్లిపోయి ఉండటంతో మృతుడు ఎవరనేది తెలుసుకోవడం కష్టంగా మారింది. మరోవైపు పీఎం పాలెం(PM Palem) పీఎస్‌లో నమోదైన మిస్సింగ్‌ కేసులో ఉన్న వ్యక్తి.. బ్రిడ్జీ దగ్గర మృతి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. తన భర్త మురళి కనిపించడం లేదంటూ ఈనెల 17న పీఎం పాలెంలో ఫిర్యాదు చేసింది భార్య మృదుల. ఈస్ట్ ఆఫ్రికాలో బుడుమూరు మురళి ఇరిట్రియా ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎనిమిది ఏళ్లుగా ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు. ఈనెల 9న మురళి ఆఫ్రికా నుంచి విశాఖ చేరుకున్నాడు. రెండు రోజులు ఇంట్లోనే ఉన్నాడు. 11న శ్రీకాకుళం జిల్లా(srikakulam district) పిల్లలవలస గ్రామంలో ఉన్న తన తల్లిని కలవడానికి కొమ్మాదిలో భర్తను డ్రాప్ చేసింది మృదుల. అప్పటి నుంచి భర్త కనించడం లేదని మృదుల పిర్యాదులో పెర్కొంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు తమదైన స్టయిల్‌లో విచారణ చేపట్టారు. వివాహేతర సంబంధం కోణంలో మృదులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో మర్డర్‌ స్కెచ్ బయటపడింది. ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేసినట్టు విచారణలో అంగీకరించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..