AP News: నా భర్త నాక్కావాలి.. బ్యానర్లతో నిరసనకు దిగిన భార్య.. అసలేమైందంటే..?

Nellore News: ఆ దంపతులకు పెళ్లయి పదేళ్లయింది. వారి ప్రేమకు గుర్తుగా ఓ బాబు కూడా ఉన్నాడు. ఇన్నాళ్లు సాఫీగా సాగుతున్న సంసారంలో తుఫాన్‌ చెలరేగింది. ఓ మైనర్‌పై

AP News: నా భర్త నాక్కావాలి.. బ్యానర్లతో నిరసనకు దిగిన భార్య.. అసలేమైందంటే..?
Nellore News

Updated on: Dec 29, 2021 | 7:19 PM

Nellore News: ఆ దంపతులకు పెళ్లయి పదేళ్లయింది. వారి ప్రేమకు గుర్తుగా ఓ బాబు కూడా ఉన్నాడు. ఇన్నాళ్లు సాఫీగా సాగుతున్న సంసారంలో తుఫాన్‌ చెలరేగింది. ఓ మైనర్‌పై కన్నేసిన భర్త… ఆమె వలలో పడిపోయాడు. కొడుకును, పదేళ్లుగా కాపురం చేసిన భార్యను సైతం కాదన్నాడు. ఆ మైనర్‌తో కలిసి చెప్పాపెట్టకుండా చెక్కేశాడు. దీంతో న్యాయం చేయాలని కోరుతూ భార్య భర్త షాపు ముందు బ్యానర్లు కట్టి పోరాటం చేస్తోంది. కోటకు చెందిన కరిముల్లా పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. అనంతరం పరిచయమైన యువతితో కలిసి ఉంటున్నాడని వివాహిత తెలిపింది.

ఈ క్రమంలో బుధవారం నెల్లూరు జిల్లా కోటలో తన భర్తకు చెందిన వస్త్ర దుకాణం ఎదుట ధర్నాకు దిగింది భార్య. తనను, తన కొడుకును గాలికి వదిలిన భర్త ప్రియురాలితో పారిపోయాడని ఆరోపించింది. భర్త ఫొటోతో ఉన్న ఫ్లెక్సీని చెప్పుతో కొట్టి నిరసన తెలిపింది. ప్లకార్డులతో బాధితురాలు భర్తకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. బంగారం, విలువైన ఇంటి స్థలాన్ని ప్రియురాలికి ఇచ్చినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రియురాలితో కలిసి వెళ్లిన తన భర్తను తనకు అప్పగించాలని వేడుకుంటోంది. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Also Read:

Watch Video: పార్లమెంట్‌లో రచ్చ రచ్చ.. ఒకరినొకరు కొట్టుకున్న జోర్డాన్‌ ఎంపీలు.. షాకింగ్‌ వీడియో

Ram Gopal Varma: సినిమా టికెట్లపై ప్రభుత్వ పెత్తనమేంటి ? .. రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు..