Europe’s Proba-3: సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..

| Edited By: Velpula Bharath Rao

Dec 06, 2024 | 10:25 PM

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఒక్కో కీలక ప్రయోగాన్ని విజయవంతం చేసుకుంటూ.. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచ దేశాల సరసన భారత్ తన పరిధిని పెంచుకుంటూ వెళుతోంది. చంద్రుడుపై వరుసగా మూడు ప్రయోగాలు చేపట్టి నాసా లాంటి సంస్థలకు సైతం సాధ్యం కానీ ఎన్నో రహస్యాలను ఇస్రో బయట పెట్టింది.

Europes Proba-3: సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
Isro
Follow us on

చంద్రయాన్ మంగళయాన్ తరువాత ఆదిత్య యాన్ పేరుతో ఆదిత్య L1 ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇస్రో విజయవంతంగా నిర్దేశిత కక్షలోకి ప్రయాణించి పరిశోధనలను మొదలుపెట్టింది. తాజాగా యూరప్‌కు చెందిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రోబ్ 3 పేరుతో మూడు ఉపగ్రహాలను అనుసంధానం చేస్తూ ప్రయోగాన్ని చేపట్టింది. అయితే ఈ ప్రయోగం కోసం భారత్‌ను సాయం కోరింది. రెండు రోజుల క్రితమే ఇస్రో శ్రీహరికోట నుంచి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తలపెట్టిన ప్రోబ్ 3 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. ఈ ప్రయోగం కూడా సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు కావడం విశేషం.

సూర్యుడిపై ఇస్రో ప్రయోగం ఎందుకంటే..?

2023 సెప్టెంబర్ 2న ఇస్రో ఆదిత్య ఎల్ వన్ ప్రయోగాన్ని మొదలుపెట్టింది. ఐదు నెలల పాటు సుదీర్ఘంగా ప్రయాణించిన ఆదిత్య ఎల్ వన్ ఉపగ్రహం.. మరి 25న సూర్యుడు పై పరిశోధనల కోసం హాలో ఆర్బిట్ లో ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టింది ఇస్రో. సూర్యునిపై ఉన్న వాతావరణం లో క్రోమోస్ఫియర్ అలాగే కరోనా పరిస్థితులను అధ్యయం చేయడం.. సూర్యుడి కణాల్లో ఉన్న డైనమిక్స్ అధ్యయనం కోసం సమాచారాన్ని అందించే పార్టికల్ ప్లాస్మా వాతావరణాన్ని గుర్తించడం కోసం కీలకంగా దోహదపడుతుంది. సూర్యుడి పై ఉన్న కరోనా పొరల వద్ద సాంద్రత వాటి వేగం ఉష్ణోగ్రత ఏ స్థాయిలో ఉంది అనేది స్పష్టంగా, సౌర తుఫానులు ఏర్పడే ముందే సమాచారం అందేలా గుర్తించడం కోసం ఉపయోగపడుతుంది. సౌర తుఫానుల కారణంగా ఇటీవల ఎలాన్ మాస్క్ ప్రవేశపెట్టిన అంతరిక్షంలోని వందలాది ఉపగ్రహాలు కూలిపోయాయి. అలాంటప్పుడు సౌర తుఫాను వల్ల జరిగే నష్టాన్ని నివారించడం కోసం కీలకమైన సమాచారం తెలుసుకోవడం కోసం ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం ద్వారా పడుతుంది. దాదాపు 11 నెలల నుంచి ఇస్రో ఆదిత్య ఎల్ వన్ ద్వారా సూర్యుని కక్ష్యలో అనేక కీలక రహస్యాలను కనిపెట్టగలిగింది.

యూరప్ చేసే ఈ ప్రయోగం ఎందుకంటే..

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తాజాగా తలపెట్టిన ప్రోబ్ 3 మిషన్ భారత్ నుంచి ప్రయోగం జరిగింది. సహకారంతో ఈ కీలక ప్రయోగాన్ని చేపట్టింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేపట్టిన ఈ ప్రయోగం కూడా సూర్యుడిపై ఉన్న వాతావరణాన్ని అధ్యయనం చేయడం కోసమే.. సూర్య కక్షలో ఉన్న వాతావరణ పరిస్థితుల అధ్యయనంతో పాటు కృత్రిమంగా సూర్యగ్రహణాన్ని సృష్టించే సాంకేతికతతో ఈ ప్రయోగం జరిగింది. భారత్ చేపట్టిన సూర్యుని వాతావరణంలోని కరోనా పై అధ్యయనం చేయడం కోసం కృత్రిమ సూర్యగ్రహనాన్ని సృష్టించడం ఈ ప్రయోగం ప్రత్యేకత. ఇందులోని రెండు ఉపగ్రహాలు సమాంతరంగా 150 మీటర్ల దూరంలో సూర్యునితో నేరుగా సమలేఖనం చేసి ఒకదాని నీడను మరొక దానిపై పంపుతుంది. దీని ద్వారా సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో ఉన్న పరిస్థితులు అక్కడ ఉన్న సమయంలో సూర్యుని కక్షలో ఉన్న వాతావరణ పరిస్థితులను సరిగ్గా అధ్యయనం చేయడం కోసం ఉపయోగపడుతుందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. ఇప్పటిదాకా సూర్యునిపై పలు అంతరిక్ష సంస్థలు పరిశోధనలు చేసినా ఈ టెక్నాలజీ మాత్రం ప్రత్యేకంగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చెప్పుకుంటోంది.