
జర్మనీ, చైనా బ్యాన్ చేసిన ఈ స్లీపర్ బస్సులను ఇండియాలో ఎందుకు నడుపుతున్నారనే ప్రశ్న ప్రమాదం జరిగినప్పటి నుంచి వినిపిస్తూనే ఉంది. అసలు చైనా ఎందుకని బ్యాన్ చేసింది వీటిని? టెక్నికల్‌గా, మాన్యువల్‌గా.. ప్రధానంగా నాలుగు మిస్టేక్స్ కనిపించాయి కాబట్టి. అది కూడా ప్రమాదాలు జరిగిన తరువాతనే స్లీపర్ బస్సు ఎంత ప్రమాదకారో అర్ధమైంది కాబట్టి. ఆ ప్రమాదాల్లో 256 మంది చనిపోయారు కాబట్టి. మరి.. ఇండియాలోనూ వంద మంది వరకు చనిపోయారు ఈ స్లీపర్ బస్ యాక్సిడెంట్‌లో. ఇక్కడెందుకని బ్యాన్ చేయడం లేదు? ప్రమాదం ఎలా జరిగిందో చెప్పుకుంటేనే.. ఈ బస్సులు ఎందుకంత ప్రమాదకారో తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు బయల్దేరిన బస్సు.. సరిగ్గా తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో రోడ్డు మీద బైక్‌పైకి ఎక్కేసింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడని అనుమానించడానికి ఇదో ఆధారం. ఎందుకంటే.. బైక్‌ను ఢీకొట్టినా సరే బస్సును వెంటనే ఆపలేదంటున్నారు ప్రత్యక్షసాక్షులు. కొంతదూరం లాక్కొనిపోవడం, బస్సు కిందకి బైక్ వెళ్లిపోవడం, నిప్పురాజుకుని బస్సుకు అంటుకోవడం జరిగింది. బస్సు ముందు భాగంలో నిప్పు అంటుకునే సరికి.. ఎలక్ట్రికల్ సిస్టమ్ డ్యామేజ్ అయింది. డోర్స్ ఓపెన్ అయ్యే సిస్టమ్ మొత్తం జామ్ అయింది. ఓవైపు మంటలు చెలరేగుతుండడంతో క్యాబిన్ నుంచి డ్రైవర్ పరారయ్యాడు. సో, ముందు నుంచి దిగే ఛాన్సే లేదు. పోనీ మరో దారి ఉందా అంటే.. అదెక్కడుందో ప్రయాణికులకు తెలీదు. పైగా గాఢనిద్రలో ఉండే సమయం. బస్ అంతా మంటలు...